
ఈ సినిమా వరల్డ్‌వైడ్‌గా రూ. 325 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ సాధించి, పవర్ స్టార్ కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డ్స్ క్రియేట్ చేసిన మూవీగా నిలిచింది. అయితే, ఈ సినిమా సక్సెస్ అయిన కొద్ది రోజులకే సోషల్ మీడియాలో “సుజిత్ – దానయ్య మధ్య విభేదాలు వచ్చాయి”, “దానయ్య సుజిత్ తో ఇక సినిమాలు చేయడంలేదు”, “నాని – సుజిత్ సినిమా నుండి దానయ్య తప్పుకున్నాడు” అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ పుకార్లపై స్పష్టతనిచ్చేందుకు స్వయంగా డైరెక్టర్ సుజిత్ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు –“సోషల్ మీడియాలో చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. అవి అన్నీ నిజం కావు. ఒక సినిమాను ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు తీసుకెళ్లడంలో ఉండే కష్టాలు, సవాళ్లు చాలా తక్కువ మందికే అర్థమవుతాయి. సినిమా చేసే వాళ్లకు అది తెలుసు, కానీ బయట ఉన్న వాళ్లకు తెలియదు.
‘ఓజీ’ సినిమా కోసం నా నిర్మాత డివివి దానయ్య గారు, నా టీమ్ అందించిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది. పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన అభిమానులు చూపించిన ప్రేమ, ఆదరణ వర్ణించలేనిది. దానయ్య గారు నాపై ఉంచిన నమ్మకం, ఇచ్చిన అవకాశానికి నేను ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు” అని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ఆ పోస్ట్ వైరల్ అయింది. అభిమానులు సుజిత్ యొక్క స్పష్టమైన స్పందనను ప్రశంసిస్తూ, “సినిమా విజయంలో ఉన్న టీమ్ స్పిరిట్‌కి ఇదే నిదర్శనం” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఫైనల్ చెప్పాలంటే .. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సుజిత్ – దానయ్య మధ్య తగాదాల వార్తలు పూర్తిగా వదంతులే. “ఓజీ” విజయంతో ఇద్దరి పేర్లూ మరోసారి తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.