టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన చిత్రం వార్ 2. ఆగస్టు 14న ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అలాగే హీరోయిన్గా కియారా అద్వానీ నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అయ్యాన్ ముఖర్జీ నిర్మించారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై యావరేజ్ గా నిలిచింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులను కూడా ఈ సినిమా మెప్పించలేకపోయింది. రిలీజ్ కి ముందు ఈ సినిమా పైన భారీ హైప్స్ తీసుకువచ్చేలా చేశారు ప్రముఖ తెలుగు నిర్మాత నాగ వంశీ. కానీ ఫ్యాన్స్ అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో తీవ్రస్థాయిలో నిరాశ పడ్డారు.


తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మాత నాగవంశీనే విడుదల చేశారు. సుమారుగా రూ .90 కోట్లకు పైగా తెలుగు రైట్స్ దక్కించుకున్నట్లు వినిపించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో వార్ 2 సినిమా నష్టాలనే చవిచూశాయని తాజాగా ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ ఇన్ డైరెక్ట్గా సినిమా ఫ్లాప్ అని కూడా మాట్లాడినట్లు వినిపిస్తున్నాయి. రవితేజ మాస్ జాతర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగవంశీ వార్ 2 సినిమా ప్రస్తావన రాగ మాట్లాడారు.


వార్ 2 సినిమా విషయంలో తప్పు జరిగింది ఏం చేస్తాం చెప్పండి. నేనైనా, ఎన్టీఆర్ గారైన ఆదిత్య చోప్రా, యష్ రాజ్ ఫిలిమ్స్ వంటి వాటిని నమ్మాము.. అందరూ తప్పులు చేస్తారు! వాళ్ళ సైడ్ నుంచి తప్పు జరిగింది ఇందులో మనం దొరికిపోయాము అంతే అంటూ తెలిపారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళని నమ్మి మేము మిస్ ఫైర్ అయ్యాం అంటూ తెలిపారు నాగ వంశీ. ట్రోల్ చేయాలని మిమ్మల్ని చాలామంది చూస్తున్నారు అంటూ యాంకర్ ప్రశ్నించగా పోనీలే మన సినిమాతో కాకుండా బయట సినిమాతో దొరికాము అందుకు హ్యాపీ అంటు తెలిపారు నాగ వంశీ. మొత్తానికి వార్ 2 సినిమా గురించి నాగ వంశీ ప్రస్తుతం  మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: