
ఇక ఇటీవల రమ్యకృష్ణ, హీరో జగపతిబాబు హోస్ట్ చేస్తున్న జీ తెలుగు షో జయమ్ము నిశ్చయమ్మురాలో సందడి చేసింది. స్పెషల్ గెస్ట్‌గా హాజరైంది. ఆమె ఎంట్రీతోనే షో వాతావరణం మారిపోయింది. జగపతిబాబు స్టైలిష్ టీషర్ట్‌లో యంగ్ లుక్‌లో కనిపించగా, రమ్యకృష్ణ తన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్‌తో స్టేజ్‌పై అందరినీ ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య జరిగిన సరదా మాటలు, చమత్కారాలు, నవ్వులు షోలో ప్రధాన హైలైట్‌గా నిలిచాయి.అక్కడ జగపతిబాబు మాట్లాడుతూ — “చిన్నప్పటి నుంచి చాలా మంది నిన్ను సైట్ కొట్టారట, ప్రేమించారట, ఫిదా చేసారట...” అని అంటున్న సమయంలో// దానికి వెంటనే రమ్యకృష్ణ నవ్వుతూ, “ఇంక్లూడింగ్ యూ!” అని కౌంటర్ ఇచ్చేసింది. ఒక్కసారిగా స్టేజ్ మొత్తం నవ్వులతో మార్మోగిపోయింది. జగపతిబాబు కూడా సిగ్గుపడుతూ స్మైలింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు.
ఈ చిన్న ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కామెంట్స్‌లో "రమ్యకృష్ణ అందం, టాలెంట్ కి ఎవరైనా ఫిదా అవ్వడమే తధ్యం" అంటూ ట్రెండ్ చేస్తున్నారు. కొంతమంది అయితే, “రమ్యకృష్ణ అందానికి అప్పట్లో చాలా మంది పెళ్లైన హీరోలు కూడా సైట్ కొట్టారట” అంటూ పాత టాపిక్‌ను కూడా మళ్లీ తెరపైకి తెచ్చారు.ఇక ఈ షో పూర్తి ఎపిసోడ్ ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ప్రోమోలో చూపిన ఆ చమత్కార కౌంటర్లు, నవ్వులు, ముచ్చట్లు చూసి — “ఇంకా ఎంత ఎంటర్టైనింగ్ కానుందో!” అని అందరూ అనుకుంటున్నారు.సీనియర్ హీరోయిన్ అయినా, ఈ రోజుకీ కుర్ర హీరోయిన్స్‌కే కాదు, కుర్ర హీరోలకూ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్న రమ్యకృష్ణ — అందం, నటన, కరిజ్మా — అన్నీ కలిపిన అరుదైన స్టార్ అని చెప్పాలి.