సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది హీరోలు ఎన్నో సినిమాలను వదిలేస్తూ ఉంటారు. అలా ఒక హీరో ఒక సినిమా వదిలేయడానికి అనేక కారణాలు ఉంటాయి. కొంత మంది ఒక దర్శకుడు వచ్చి సినిమా కథ చెప్పినప్పుడు ఆ కథ నచ్చకపోవడం వల్ల సినిమా ఆఫర్ ను రిజక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంత మంది కథ నచ్చిన ఆ సమయం లో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల సినిమాను రిజక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంత మంది మరికొన్ని కారణాల వల్ల సినిమాను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

ఇక వారు రిజెక్ట్ చేసిన సినిమా విడుదల అయ్యాక మంచి విజయం సాధించి అందులోని ఆ పాత్రకు మంచి గుర్తింపు దక్కినట్లయితే ఆ రోజు ఆ సినిమా రిజెక్ట్ చేసినందుకు బాధ పడడం జరగడం సర్వసాధారణం. అదే సినిమా గనుక ఫ్లాప్ అయినట్లయితే ఆ రోజు ఆ మూవీ ని రిజెక్ట్ చేసి చాలా మంచి పని చేశాం అని జరగడం కూడా సర్వసాధారణం. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని తన కెరియర్లో చాలా సినిమాలను రిజక్ట్ చేశాడు. అందులో ఓ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఆ సినిమాలోని హీరో పాత్రకు కూడా మంచి ప్రశంసలు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి దక్కాయి. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు రవితేజ హీరోగా రూపొందిన రాజా ది గ్రేట్.

మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కథను మొదట అనిల్ రావిపూడి , రామ్ వినిపించగా ఆయన ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని రామ్ చెప్పాడట. దానితో రవితేజ కు ఈ మూవీ కథను వినిపించగా ఆయన ఆ మూవీ కథ బాగా నచ్చడంతో అందులో నటించాడు. రవితేజ ఈ సినిమాలో బ్లైండ్ పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమాలోని రవితేజ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: