టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలకృష్ణ ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి సూపర్ సాలిడ్ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మాస్ దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొంత కాలం క్రితం వీర సింహా రెడ్డి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికి తెలిసిందే.

మూవీ 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది. ఇకపోతే మరి కొంత కాలం లోనే బాలయ్య హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో మూవీ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇది ఇలా ఉంటే చాలా కాలం క్రితమే బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబోలో ఓ మూవీ రావాల్సింది. కానీ చివరి నిమిషంలో ఆ సినిమా క్యాన్సల్ అయింది. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు బాడీ గార్డ్. గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపొందిన బాడీ గార్డ్ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట ఈ మూవీ లో గోపీచంద్ మలినేని , బాలకృష్ణ ను హీరో గా తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా బాలకృష్ణ ను కలిసి సినిమా కథను కూడా వివరించాడట.  కానీ కొన్ని కారణాల వల్ల బాలకృష్ణ ఆ సినిమాలో నటించను అని చెప్పాడట. దానితోవెంకటేష్ ను సంప్రదించగా ఆయన మాత్రం ఆ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడట. అలా బాలయ్య , గోపీచంద్ మలినేని కాంబోలో బాడీ గార్డ్ అనే సినిమా మిస్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: