
మోహన్ బాబు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో “మై డియర్ డార్లింగ్ బావా… నీ జీవితం అపరిమితమైన సంతోషంతో నిండిపోవాలి. నువ్వు ఇంకా ఎన్నెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి. 100 ఏళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి. అంతేకాకుండా నువ్వు త్వరగా పెళ్లి చేసుకొని అరడజన్ మంది పిల్లలతో సంతోషమైన జీవితాన్ని గడపాలి. ఆ సంతోషాన్ని నేను నా కళ్లారా చూడాలి. ఎప్పటికీ బావా, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా…” అంటూ రాశారు. మోహన్ బాబు ఇలా హాస్యాన్ని కలిపిన ప్రేమతో కూడిన బర్త్‌డే విషెస్ చెప్పడంతో, ఆ పోస్ట్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రభాస్ అభిమానులు ఈ పోస్ట్‌ను తెగ షేర్ చేస్తూ, “మోహన్ బాబు గారి విషెస్ వేరే లేవల్”, “ఇది నిజంగా మస్త్‌గా ఉంది”, “ఈ లైన్ పర్ఫెక్ట్ – అరడజన్ పిల్లలతో హ్యాపీ లైఫ్!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు మోహన్ బాబు చెప్పిన ఆ లైన్‌పై ఫన్నీ మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. కొందరు “ప్రభాస్ పెళ్లి ఎప్పుడు?” అని అడుగుతుంటే, మరికొందరు “మోహన్ బాబు గారుఆ పెళ్లి మీరే చేసి పుణ్యం కట్టుకోండి?” అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, మోహన్ బాబు ప్రేమతో కలిపిన ఈ వెరైటీ విషెస్ ఇప్పుడు టాలీవుడ్, సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారిపోయాయి. రెబల్ స్టార్ ప్రభాస్‌పై ఆయన చూపిన ఆ మమకారం, హాస్యం కలగలిసిన శుభాకాంక్షలు అభిమానుల హృదయాలను తాకాయి.