ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తునిలో ఒక దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అదేమిటంటే బాలికపై టిడిపి నేత అత్యాచారానికి పాల్పడినట్లుగా ఆలస్యంగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు సైతం ఆ టిడిపి నేతకు బుద్ధి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి విషయాలు ఇప్పుడు చూద్దాం.



అసలు విషయంలోకి వెళ్తే జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలికను తాను తాతయ్య వరుసను అవుతానంటూ అక్కడివారికి మాయ మాటలు చెప్పి ఆ బాలికను స్కూలు నుండి స్కూటీపై తోటలోకి తీసుకువెళ్లారు టిడిపి నేత నారాయణరావు. అయితే నారాయణరావుకు తెలియకుండా మరొక వ్యక్తి అతని ఫాలో అవుతూ వీడియో తీసినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియోలో బాలిక దుస్తులు వేసుకుంటూ ఉండగా ఆ బాలికను ఏం చేశావంటూ వీడియో తీస్తున్న వ్యక్తి  ఆ టిడిపి నేతని  ప్రశ్నించగా అక్కడ నుంచి సమాధానం చెప్పకుండా ఏం చేస్తావో చేసుకోపో అంటూ ఆ బాలికను బైక్ పైన ఎక్కించుకొని మరి పరారయ్యారు టిడిపి నేత.


ఇందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగి నారాయణరావు పైన కేసు నమోదు చేసి మరి దర్యాప్తు చేస్తున్నారు. గురుకుల పాఠశాల సిబ్బంది, తల్లితండ్రులను పిలిపించి మరి విచారణ చేపట్టారు. అయితే నారాయణరావు ఇప్పటికే ఇలా నాలుగైదు సార్లు బాలిక బంధువులమంటూ తీసుకువెళ్లారని హాస్టల్ తెలియజేస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులు కూడా బాలికకు న్యాయం చేయాలి అంటూ ఆందోళన చేపట్టారు. రాజకీయ కోణంలో తప్పుదారి పట్టించే విధంగా చూస్తున్నారంటు రూరల్ ఎస్సైతో బాలిక కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లుగా వినిపిస్తున్నాయి. ఉన్నత అధికారులతో దర్యాప్తు చేపించాలంటు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ,కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురై నారాయణరావుకు తగిన బుద్ధి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారంది.

మరింత సమాచారం తెలుసుకోండి: