జూబ్లీహిల్స్ ఎన్నిక చాలా కీలకంగా మారింది. ఇక్కడ పోటీ చేసిన ప్రతి పార్టీ  గెలుపు కోసమే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా తుది పోరు అనేది బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఉండబోతోంది.. ఎవరికి వారే గెలుపు పై ధీమా  వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో ఇప్పటికే నామినేషన్స్ స్క్రూటినీ ప్రక్రియ పూర్తయింది.. ఈ క్రమం లోనే అధికారులు కొన్ని గంటల పాటు కసరత్తు చేసి  నామినేషన్లు వేసిన పత్రాలను గమనించి తప్పులు ఉన్న వాటన్నింటిని తిరస్కరించారు. మరి ఎంత మంది నామినేషన్లు తిరస్కరించారు.. ఎంతమంది అభ్యర్థులు మిగిలారు అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కు సంబంధించి మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 

ఇందులో మొత్తం 321 వచ్చాయి. ఈ నామినేషన్స్ అధికారులు దాదాపు 17 గంటల పాటు స్క్రూటినీ చేసిన తర్వాత మొత్తం 81 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 135 నామినేషన్స్ కు మాత్రమే ఆమోదం తెలిపారు. వివిధ కారణాల వల్ల మొత్తం 130 మంది అభ్యర్థులు వేసినటువంటి 186 నామినేషన్లను తిరస్కరించారు ఎన్నికల అధికారులు. సరైన పత్రాలు అటాచ్ చేయకపోవడం, అలాగే నామినేషన్ల పత్రాలు సరిగ్గా రాయకపోవడం  ఇలా వివిధ కారణాలతో 186 నామినేషన్లు తిరస్కరణ కు గురయ్యాయి. ఇక 81 మంది అభ్యర్థులు బరిలో ఉండబోతున్నారు.

అయితే నామినేషన్ల ఉపసంహరణకు మాత్రం ఈనెల 24 చివరి తేదీగా ప్రకటించారు ఎన్నికల అధికారులు. మరి రేపు ఎంత మంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారు.. ఎంతమంది బరి లో ఉంటారు అనేది తెలియబోతోంది. ముఖ్యంగా ఈ నామినేషన్లు వేసిన వారిలో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు మరి కొంతమంది జూబ్లీహిల్స్ నాయకులు  నామినేషన్లు వేశారు. మరి ఇందులో ఎవరు ఉపసంహరించుకుంటారు అనేది మరి కొన్ని గంటల్లో తేలబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: