టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి నట సింహం బాలకృష్ణ ఇద్దరు కూడా అనేక సందర్భాలలో బాక్సా ఫీస్ దగ్గర తలపడ్డారు. మరీ ముఖ్యంగా వీరిద్దరి మధ్య బాక్సా ఫీస్ పోరు సంక్రాంతి పండుగ సందర్భం గా ఎక్కువ సార్లు జరిగింది. ఇక అలాంటి వార్ ఒకటి కొన్ని సంవత్సరాల క్రితం చిరంజీవి , బాలయ్య జరిగింది. అందులో ఎవరు ఏ సినిమాతో తలపడ్డారు ..? ఫైనల్ గా ఆ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా ఎవరు నిలిచారు ..? అనే వివరాలను తెలుసుకుందాం.

2004 వ సంవత్సరం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన అంజి సినిమా మరియు బాలకృష్ణ హీరోగా రూపొందిన లక్ష్మీ నరసింహ సినిమాలు సంక్రాంతి పండుగ సందర్భంగా బరిలో నిలిచాయి. విడుదలకు ముందు అంజి మరియు లక్ష్మీ నరసింహ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాలలో అంజి సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. లక్ష్మీ నరసింహ సినిమాకు మాత్రం మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. దానితో అంజి సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. ఈ సినిమాతో చిరంజీవి కి అపజయం కూడా దక్కింది. ఇక లక్ష్మీ నరసింహ మూవీ కి మంచి టాక్ రావడంతో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తో బాలయ్య కు కూడా మంచి విజయం దక్కింది. ఇక భారీ అంచనాల నడుమ ఈ రెండు సినిమాలు విడుదల అయినప్పటికీ చిరంజీవి హీరోగా రూపొందిన అంజి సినిమా కంటే కూడా బాలకృష్ణ హీరోగా రూపొందిన లక్ష్మీ నరసింహ సినిమా మంచి కలెక్షన్లను వసూలు చేసి 2004 వ సంవత్సరం సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: