తాజాగా విడుదలైన బిగ్ బాస్ 9 సీజన్ ఎపిసోడ్ ప్రోమోలో సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్లు వీడియో వైరల్ గా మారింది. సుమన్ శెట్టి ని అలా చూసి ఆయన అభిమానులు కూడా ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు. విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. టాస్క్ లో భాగంగా గార్డెన్ ఏరియాలో కొన్ని బొమ్మలు పెట్టి ఆ బొమ్మలకు హౌస్ లో ఉన్నటువంటి వారి ఫోటోలను ఉంచారు. హౌస్ మేట్స్ వారికి నచ్చిన బొమ్మ తీసుకొని ముందుగా సేఫ్ జోన్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆఖరిగా ఎవరు చేరుకుంటారో వారి చేతిలో ఎవరి బొమ్మ ఉంటుందో వారి నామినేషన్ లోకి వస్తారంటూ బిగ్ బాస్ తెలియజేస్తారు.
ముందుగా సంజన, రీతూ గురించి చెబుతుంది. ఆ తర్వాత అటు రీతూ ,సంజన మధ్య ఒక పెద్ద వార్ జరిగినట్టుగా చూపించారు. ఆ వెంటనే తనూజ, సంజన మధ్య కూడా వాదన జరుగుతుంది. అలాగే తనుజాకు దివ్యకు కూడా మధ్య చిన్న వార్ జరుగుతుంది. ఫైనల్ గా సుమన్ శెట్టి మిగిలిపోవడంతో అతని దగ్గర కేవలం తనూజ బొమ్మ ఉండడంతో సుమన్ శెట్టి మాట్లాడుతూ నాదే ఫాల్ట్ నేను నెమ్మదిగా వెళ్లాను కాబట్టి తనుజాను నామినేట్ చేయాలని తాను అనుకోవడం లేదంటూ అందుకు తానే నామినేట్ చేసుకుంటున్నాను అంటూ సుమన్ శెట్టి ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టుకొని చెప్పడం అందరికీ షాక్ గురయ్యేలా చేసింది. అయితే సుమన్ శెట్టి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో పై అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి