బడా కంపెనీలు సైతం పవన్ కళ్యాణ్ డేట్ ల కోసం ఎదురుచూసినప్పటికీ (సాఫ్ట్ డ్రింక్, క్లాతింగ్, ఫైనాన్షియల్ కంపెనీలు పలు రకాల రియల్ ఎస్టేట్) వంటి బ్రాండ్లు కూడా యాడ్ కోసం సంప్రదించగా ఆయన మాత్రం చేయనని చెప్పేశారట. ముఖ్యంగా తాను నమ్మని దాన్ని ప్రజలను కొనమని ఎలా చెబుతానంటూ తేల్చి చెప్పారట పవన్ కళ్యాణ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వంటి హీరో యాడ్ చేశారంటే కచ్చితంగా వాటిని కొనడానికి మక్కువ చూపుతారని అభిమానులు చెప్పవచ్చు. వాటిని పలు రకాల కంపెనీలు క్యాష్ చేసుకోవాలని చూసిన పవన్ కళ్యాణ్ అందుకు నిరాకరించారు.
తన అభిమానుల కోసం తాను ఇలాంటివి అసలు చేయలేనని కమర్షియల్ యాడ్ చేయడం వల్ల కూడా విలువలకు విరుద్ధంగా ఉంటుందని చెప్పేశారట. సిని రంగంలో భారీ మొత్తంలో పారితోషకం తీసుకుంటున్న హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అభిమానులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిరాశపరిచారు. కాని ఓజి సినిమాతో మాత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రం ఉన్నది. మరి రాబోయే రోజుల్లో మరిన్ని సినిమాలలో నటిస్తారా? లేకపోతే పూర్తిగా రాజకీయాలకు సమయాన్ని కేటాయిస్తారా అనే విషయం తెలియాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి