ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన రకుల్ ప్రీతిసింగ్ ఎన్నో భాషలలో నటించి అద్భుతమైన నటనతో పేరు సంపాదించింది. ఈ మధ్యకాలంలో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడే సినిమాలలో నటిస్తోంది. అక్కడ కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోవడంతో రకుల్ ప్రీతిసింగ్ కూడా అవకాశాలు తగ్గిపోయాయి. నిరంతరం ఫోటోషూట్లు ,జిమ్ వీడియోలతో గ్లామర్ గా కనిపించిన మెయిన్ హీరోయిన్ గా రాబట్టలేకపోతోంది.
బాలీవుడ్లో స్టార్ హీరోగా పేరు సంపాదించిన అజయ్ దేవగన్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దే దే ప్యార్ దే- 2 చిత్రంలో రకుల్ ప్రీతిసింగ్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ చిత్రంలోని ఒక పాటని విడుదల చేయగా ఈ పాటలో రకుల్ ప్రీతిసింగ్ ఓ రేంజ్ లో రెచ్చిపోయినట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా గ్లామర్ డోస్ మరింత ఎక్కువ పెంచేసినట్టుగా కనిపిస్తోంది. అజయ్ దేవగన్ తో వేసిన ఒక స్టెప్ లో రకుల్ తన ఛాతి పైన వాలి మరి డాన్స్ చేసిన సీన్ చూసిన నెటిజన్స్ సైతం ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారు. తోటి హీరో అయ్యి ఉండి ఆమెతో ఇంత అసభ్యకరంగా డాన్స్ చేయాలా అంటూ అజయ్ దేవగన్ కూడా ట్రోల్ చేస్తున్నారు. మరి కొంతమంది సినిమాకు హైప్ పెంచే ప్రయత్నంలో భాగంగా రకుల్ ఇటువంటి పనిచేస్తుందా అంటూ ఆమెను ట్రోల్ చేస్తు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనాప్పటికీ మొత్తానికి రకుల్ ప్రీతిసింగ్ అందాల ఆడబోతకు నేటిజన్ చేతిలో ఆమెకు ట్రోల్స్ తప్పడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి