దక్షిణాది సినీ పరిశ్రమలో తన ప్రతిభతో, అందంతో, అద్భుతమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేష్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సంచలన వార్త చక్కర్లు కొడుతోంది. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. టాలీవుడ్ లో అందాల కుందనపు బొమ్మ అని ట్యాగ్ చేయించుకున్న కీర్తి సురేష్ బాలీవుడ్ కి వెళ్లాక మాత్రం ఘాటుగా ట్రోలింగ్ కి గురి అయ్యింది. ఆమె ఎక్స్ పోజింగ్ కూడా చేయడం స్టార్ట్ చేసింది.
 

కాగా ఇప్పుడు కీర్తి సురేష్ కి సంబంధించిన ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. బాలీవుడ్‌లో అత్యంత ప్రముఖుడైన ఓ స్టార్ డైరెక్టర్ తన కొత్త భారీ చిత్రంలో ఉన్న ఐటెం సాంగ్‌లో కీర్తి సురేష్‌ను నటించమంటూ ఒత్తిడి చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డైరెక్టర్ కామన్ ఫ్రెండ్ ద్వార కీర్తి సురేష్ ని కనెక్ట్ అయ్యి ఐటెం సాంగ్ చేయమంటూ ఫోర్స్ చేస్తున్నారట.  తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలతో పాటు ఇప్పుడు హిందీ సినిమాలపై కూడా దృష్టి పెట్టిన కీర్తి, తన కెరీర్‌లో ఎప్పుడూ  నటనకే ప్రాధాన్యం ఇచ్చిన నటి.. బాలీవుడ్ కి వెళ్ళాక ఇలాంటి పరిస్ధితి రావడం మరి ద్గారుణంగా ఉంది అంటున్నారు జనాలు. మహానటిగా పాపులారిటి సంపాదించుకున్న  ఆమెను ఒక ఐటెం సాంగ్ కోసం బలవంతం చేయడం సినీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.



వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ఆ డైరెక్టర్ ఈ పాటను భారీ స్థాయిలో చిత్రీకరించి దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాడట. కానీ కీర్తి మాత్రం ఈ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించిందని తెలుస్తోంది. తన ఇమేజ్‌కి సరిపడని పాత్రలలో లేదా సీన్లలో తాను ఎప్పుడూ నటించబోనని ఆమె స్పష్టంగా చెప్పేసిందట.దీంతో ఆ డైరెక్టర్ నిరాశ చెందాడని, అయినా కూడా ఆమెను ఒప్పించడానికి పలు మార్గాలు ప్రయత్నిస్తున్నాడని సినీ వర్గాల సమాచారం. ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదుగానీ, ప్రస్తుతం బాలీవుడ్ మరియు టాలీవుడ్-బాలీవుడ్  సర్కిల్స్‌లో ఇది హాట్ టాపిక్‌గా మారింది. కీర్తి సురేష్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఆమెకు సపోర్ట్‌గా పోస్ట్‌లు పెడుతూ, “మన కీర్తి గౌరవం మన గర్వం” అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: