తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ పేరు అంటే ఓ సెన్సేషన్‌నే. ప్రతి సినిమా కోసం తన శరీరాన్ని, లుక్స్‌ను, ఆ హావభావాలను పూర్తిగా మార్చేసే డెడికేషన్‌ కలిగిన స్టార్‌గా ఆయనకు ఉన్న పేరు వేరే ఎవరికి లేదు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న “డ్రాగన్” సినిమా కూడా దానికి నిదర్శనం.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ అద్భుతమైన స్థాయిలో, పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం తారక్ పెట్టుకున్న కష్టాలు, చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇప్పుడే ఇండస్ట్రీ టాక్‌గా మారిపోయింది.


ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రతి పోస్టర్‌లో ఎన్టీఆర్ లుక్ ఒక కొత్త హైప్‌ని తీసుకొచ్చింది. ఆయన్ను చూసి అభిమానులు “ఇదే తారక్ మ్యాజిక్!” అంటూ ఫిదా అవుతున్నారు.కానీ ఇటీవల ఎన్టీఆర్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించిన లుక్స్ చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. డ్రాగన్ షూటింగ్ ప్రారంభమైనప్పుడు ఉన్న లుక్‌కి, ఇప్పుడు ఆయన కనిపిస్తున్న లుక్‌కి అసలు పోలిక లేదు. తారక్ అకస్మాత్తుగా బరువు తగ్గిపోవడం, కొంచెం బలహీనంగా కనిపించడం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. కొందరు "తారక్ ఆరోగ్యం బాగోలేదేమో?" అని అనుకుంటే, మరికొందరు “ఇది సినిమాలో భాగమే” అని ఊహాగానాలు మొదలుపెట్టారు.



అయితే, నిజం మాత్రం వేరేలా ఉంది. డ్రాగన్ సినిమాలోని ప్రత్యేకమైన పాత్ర కోసం ఎన్టీఆర్ స్వయంగా బరువు తగ్గాడట. ప్రశాంత్ నీల్ చెప్పిన రోల్ రిక్వైర్మెంట్‌కి తగిన విధంగా తారక్ ప్రత్యేకంగా డైట్ ఫాలో అయ్యాడు. ఆయన ఫిట్‌నెస్ ట్రైనర్ సాయంతో ప్రతిరోజూ కఠినమైన వర్కౌట్‌లు, కంట్రోల్డ్ డైట్ ప్లాన్ పాటించాడట.ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా తారక్ కోసం రెండు ప్రత్యేక “రూల్స్” అమలు చేశాడట. మొదటిది – తారక్ పూర్తి కంఫర్ట్‌లో ఉండాలి. రెండోది – ఆయన ఫాలో అవుతున్న డైట్‌లో ఏ ఒక్క మార్పు ఉండకూడదు. ఈ రెండింటినీ తారక్, నీల్ ఇద్దరూ చాలా క్రమశిక్షణగా పాటించడం వల్లే ఎన్టీఆర్ లుక్ ఇలా అద్భుతంగా మారిందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి.



తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో దర్శనమిచ్చిన తారక్ లుక్‌ మాత్రం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. గుబురు గడ్డం, స్టైలిష్ బ్లాక్ గాగుల్స్, నార్మల్ చెక్ షర్ట్ మీద బ్లాక్ కోట్ వేసుకుని, కెమెరాల వైపు మీసం మెలేస్తూ నడుస్తుంటే – నిజంగానే పులిలా కనిపించాడు. అభిమానులు సోషల్ మీడియాలో “ఇదే మన తారక్ మాస్ అవతారం”, “డ్రాగన్‌లో ఎన్టీఆర్ మరోసారి రికార్డులు బద్దలుకొట్టబోతున్నాడు” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అంతకు ముందు కంటే ఇప్పుడు ఎన్టీఆర్ లుక్‌లో ఉన్న నెమ్మదితనం, స్టైల్, కళ్ళలో ఉన్న ఆ కంఫిడెన్స్ అన్నీ వేరే లెవెల్‌లో ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: