విజయ్ మాస్టర్, జీవి ప్రకాష్ ఆడియే, ధనుష్ తో పాటు కొంతమంది హీరోల చిత్రాలలో నటిస్తోంది గౌరీ కిషన్. ప్రస్తుతం ఈమె నటించిన అదుర్స్ సినిమా నవంబర్ 7న అవుతోంది .ఈ సినిమా ప్రమోషన్స్ లో నిన్నటి రోజున చెన్నైలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు చిత్ర బృందం. అయితే అక్కడ ఒక విలేఖరి మాట్లాడుతూ మిమ్మల్ని ఎత్తితే ఎంత బరువు ఉంటారు అంటూ ప్రశ్నించగా? అందుకు గౌరీ కిషన్ సీరియస్ గా మాట్లాడుతూ నా బరువు తెలుసుకొని నువ్వేం చేస్తావు ఇదంతా ఎవరినైనా శారీరకంగా అవమానించడమే నేను ఒక చిత్రంలో నటించాను వాటి గురించి మాత్రమే అడగండి నువ్వు అడిగిన దానికి నా ఇమేజ్ ని ఎగతాళి చేసిన ప్రశ్నగా ఉందంటూ ఘాటుగానే సమాధానాన్ని తెలిపింది.
ఆ విలేకర్ స్పందిస్తూ.. అప్పుడు అడిగిన ప్రశ్ననే మళ్లీ అడుగుతున్నాను నేను సాధారణ ప్రశ్నలే అడిగాను తప్పుగా ఏమీ అడగలేదు.. నేను నిన్ను మోడీ గురించి అడగవచ్చా ? ఖుష్బూ , సరిత వంటి వారు కూడా ఈ ప్రశ్న ఎదుర్కొన్నారంటూ తెలిపారు. ఈ విషయం పైన మరొకసారి ఫైర్ అయిన గౌరీ కిషన్ నేను ఈ సినిమాలో నటించాను ఇందులో పాత్ర గురించి అడగండి తప్ప నా బరువు గురించి అడగడం నాకు ఇష్టం లేదు? నా బరువు గురించి తెలుసుకోవడం అంత ముఖ్యమా? నేను ఇక్కడ ఉన్న ఏకైక మహిళను నా చుట్టూ చాలామంది పురుషులే ఉన్నారు.మీరు బాడీ షేమింగ్ వంటివి చేస్తున్నారంటూ మీ వృత్తికే ఇది అవమానం తెస్తుందంటూ ఫైర్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి