ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ప్రశాంత్ నీల్ ఒకరు. ఈయన ఉగ్రం అనే కన్నడ సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ ని కేవలం కన్నడ భాషలో మాత్రమే విడుదల చేయడంతో ఈ మూవీ ద్వారా ప్రశాంత్ కి కేవలం కన్నడ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన కే జి ఎఫ్ చాప్టర్ 1 అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు.

మూవీ అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమా ద్వారా ఇండియా వ్యాప్తంగా ప్రశాంత్ కి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కే జి ఎఫ్ చాప్టర్ 2 మూవీ కూడా మంచి విజయం సాధించడంతో ఈయన క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. కొంత కాలం క్రితం ఈయన ప్రభాస్ హీరోగా సలార్ పార్ట్ 1 అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ప్రశాంత్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఉగ్రం సినిమాను మినహాయిస్తే ప్రశాంత్ రూపొందించిన కే జి ఎఫ్ సినిమాను రెండు భాగాలుగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు.

అలాగే సలార్ మూవీ ని కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నాడు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో ప్రస్తుతం ప్రశాంత్ రూపొందిస్తున్న సినిమాను కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న సినిమాపై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: