నాగార్జున అభిమానులకు ఇది నిజంగా ఓ భావోద్వేగ క్షణం. ఎందుకంటే ఈ సినిమా నాగార్జున కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ మాత్రమే కాదు, ఆయనను ఓవర్‌నైట్ స్టార్‌గా నిలిపిన హిట్. “శివ” తర్వాతే నాగ్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వెంకీని వదిలి నాగ్‌తో హిట్ కొట్టిన ఆర్జీవీ: ఇక ఈ సినిమా వెనుక ఒక ఆసక్తికరమైన స్టోరీ ఉంది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదట ఈ కథను వెంకటేష్ కోసం సిద్ధం చేశారట! కథ విని రామానాయుడు గారికి కూడా బాగా నచ్చిందట. కానీ వెంకీ అప్పటివరకు ఫ్యామిలీ డ్రామాలు మాత్రమే చేస్తున్నందున, ఇలాంటి యాక్షన్, రియలిస్టిక్ సబ్జెక్ట్‌కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారో లేదో అనిపించి, ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారట.
ఇక ఆ తర్వాత వర్మ గారికి కన్‌ఫ్యూజన్ - ఎవరితో ఈ సినిమా తీయాలి? అప్పటికే నాగార్జున లవ్ స్టోరీస్, రొమాంటిక్ రోల్స్ లో బిజీగా ఉన్నా, రామానాయుడు గారు “ఇదే కరెక్ట్ హీరో” అని సజెస్ట్ చేయడంతో ఆర్జీవీ నాగ్‌కి కథ చెప్పారట. కథ విన్న వెంటనే నాగ్ ఒప్పుకున్నారు. మిగతా చరిత్రే! రికార్డులు రాసిన ‘శివ’: రిలీజ్ అయిన వెంటనే “శివ” బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఆ కాలంలోనే ఈ సినిమా ఐదు కోట్లకుపైగా షేర్ వసూలు చేసి, ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. నాగ్ స్టైల్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ అన్నీ కలిపి కొత్త యుగానికి నాంది పలికాయి. ఇప్పుడీ రీ రిలీజ్ తో ఆ లెజెండరీ ఫీలింగ్ మళ్లీ మేకింగ్‌లో ఉంది. కొత్త తరం ఆ క్లాసిక్ వైబ్‌ను థియేటర్‌లో ఫీల్ చేయబోతోంది. “శివ” రాకతో మళ్లీ ఒక యుగం రీబూట్ అవుతుందనే చెప్పాలి!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి