రాహుల్ మాటల్లోనే –“నాగార్జున గారు నాతో, ‘రాహుల్… రియాలిటీని అంగీకరించాలి. నీకు బాధ కలగొద్దు. ఇవాళ ఫ్లాప్ టాక్ వచ్చింది కానీ రేపటికి పికప్ అవుతుంది,’ అని చెప్పారు. ఆయన చెప్పిన ఆ మాటలు నాకు ఎంతో ధైర్యం ఇచ్చాయి. కానీ మూడు రోజులకు తర్వాత మళ్లీ నాగార్జున గారు ఫోన్ చేసి, ‘ప్రేక్షకులు ఇచ్చిన తీర్పు నిజమైనదే. ఈ సినిమా ద్వారా నేను కూడా చాలా నేర్చుకున్నాను. నీతో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించింది,’ అని అన్నారు.
”ఈ సంఘటనను గుర్తుచేసుకుంటూ రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ..“నాగార్జున గారి వంటి లెజెండరీ నటుడితో పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో పని చేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సినిమా ఫలితం మన చేతుల్లో ఉండదు కానీ ప్రతి ప్రాజెక్ట్ మనకు ఒక కొత్త పాఠం నేర్పుతుంది.” ఇక నాగార్జున నటించిన మొదటి ‘మన్మధుడు’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ రొమాంటిక్ కామెడీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘మన్మధుడు 2’ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. కథ, ట్రీట్మెంట్, హ్యూమర్ స్టైల్ ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేదు. అయినప్పటికీ రాహుల్ రవీంద్రన్ తన వైఫల్యాన్ని సానుకూలంగా తీసుకుని, దాన్నుంచి నేర్చుకోవడం తన పెద్ద విజయమని చెబుతున్నారు.
ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో రాహుల్ మళ్లీ బిజీ అయ్యారు. ప్రేక్షకులు, విమర్శకులు ఇద్దరూ ఈ సినిమాలోని ఎమోషనల్ కంటెంట్‌ని, ఆయన దర్శకత్వాన్ని ప్రశంసిస్తున్నారు. ఇలా నటుడిగా ప్రారంభమై, దర్శకుడిగా తన సొంత గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ప్రతిభావంతమైన ఫిల్మ్ మేకర్‌గా ఎదుగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి