ఇక ఈ సినిమాకి తర్వాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేయబోతున్నాడు? అన్న ప్రశ్న సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. మొదట అక్కినేని నాగార్జునతో కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలు పూర్తిగా ఫేక్ అని క్లారిటీ వచ్చింది. ఇక తాజాగా వెలువడిన ఇండస్ట్రీ టాక్ ప్రకారం, అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా కోసం ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌పై ఫ్యాన్స్‌లో ఊహించని స్థాయిలో ఎగ్జైట్మెంట్ నెలకొంది.
రామ్ – అనిల్ రావిపూడి కాంబో అంటేనే ఎనర్జీకి, ఎంటర్టైన్‌మెంట్‌కి పర్‌ఫెక్ట్ కాంబినేషన్. ఈ సినిమా పూర్తిగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుందని, అందులో అనిల్ మార్క్ కామెడీ పంచ్‌లు కొత్త స్థాయిలో ఉంటాయని టాక్ వినిపిస్తోంది. కథలో ఎమోషన్, రొమాన్స్, మాస్ ఎలిమెంట్స్ అన్నీ కలగలిపి సూపర్ ప్యాకేజ్ లా ఉంటుందట. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయని, వచ్చే ఏడాది సమ్మర్ నాటికి సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందని టాక్. రామ్ పోతినేని కూడా "డబుల్ ఇస్మార్ట్" తర్వాత ఇలాంటి ఎంటర్టైనర్ కోసం రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అనిల్ రావిపూడి మళ్లీ మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాడా? రామ్ కెరీర్‌లో మరో గేమ్ చేంజర్ హిట్ రానుందా? అనే ఆసక్తి ఇప్పుడు మొత్తం ఫిల్మ్ ఫీల్డ్‌నే కవర్ చేసేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి