మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మరియు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే రెండు సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ప్రస్తుతం మన శంకర వర ప్రసాద్ గారు సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విక్టరీ వెంకటేష్ కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అయ్యాడు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల చివరి వరకు ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానున్నట్లు డిసెంబర్ నెల నుండి ఈ మూవీ ప్రమోషన్లను మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా నుండి మూవీ బృందం వారు మీసాల పిల్ల అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో 50 మిలియన్ న్యూస్ను అందుకుంది.

ఇలా సైలెంట్ గా ఈ మూవీ లోని మీసాల పిల్ల సాంగ్ అద్భుతమైన వ్యూస్ ను దక్కించుకుంటూ ముందుకు దూసుకు వెళుతుంది. ఈ మూవీ కి బీమ్స్ సిసిరిలియో సంగీతం అందించాడు. చిరంజీవి హీరో గా నటిస్తున్న మూవీ కావడం , ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో మంచి విజయం అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో మన శంకర వర ప్రసాద్ గారు సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: