కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విజయ్ ప్రస్తుతం హేచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న జన నాయగన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. \

అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక సాంగ్ను విడుదల చేసింది. దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కు సంబంధించిన తేదీ ... వేదికను ఖరారు చేస్తూ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ ను మలేషియాలో డిసెంబర్ 27 వ తేదీన నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ప్రస్తుతానికి ఈ మూవీ పై తమిళ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇకపోతే కొంత కాలం క్రితం విజయ్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్గా బీస్ట్ అనే సినిమా వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అపజయాన్ని అందుకుంది. మరి విజయ్ , పూజా హెగ్డే కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా అయినటువంటి జన నాయగన్ అని మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: