- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పుష్ప సీరిస్ సినిమాల‌తో దేశ వ్యాప్తంగా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యాడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. పుష్ప 2 సినిమా అయితే ఏకంగా రు. 1800 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు కొల్ల‌గొట్టింది. పుష్ప సీరిస్ రెండు సినిమాలు సూప‌ర్ డ‌ప‌ర్ హిట్ అయ్యాక బ‌న్నీ క్రేజ్ మామూలుగా లేదు. ఈ రెండు సినిమాలు బ‌న్నీ ని ఏకంగా వ‌ర‌ల్డ్ వైడ్ ఐకాన్ స్టార్ గా మార్చేశాయి. ఈ రెండు సినిమాల త‌ర్వాత అల్లు అర్జున్ ఏ మాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా త‌న సినిమాలు అన్నీ నేష‌న‌ల్ .. గ్లోబ‌ల్ వైడ్ గా ఉండేలా ప్లాన్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. అందుకే పుష్ప 2 సినిమా త‌ర్వాత ముందుగా అనుకున్న త్రివిక్ర‌మ్ సినిమాను ప‌క్క‌న పెట్టేసి మ‌రీ త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తో వెళుతున్నారు. జ‌వాన్ త‌ర్వాత అట్లీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు.


స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా రు. 700 కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌ట‌. ఈ సినిమాను అంత‌ర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందుకోసం అమెరికాలో పేరున్న వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్ తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అట్లీ త‌ర్వాత బ‌న్నీ క్రేజీ లైన‌ప్‌తో దూసుకు వెళుతున్నాడు. ఈ సినిమా త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌. ఎస్‌. రాజ‌మౌళి తో సినిమా చేసేందుకు బ‌న్నీ ప్లాన్ వేసుకుంటున్నాడ‌ట‌. రాజ‌మౌళి త‌ర్వాత సంజయ్ లీలా బ‌న్సాలీ .. ఆ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్‌తో సినిమాలు చేసేందుకు బ‌న్నీ సిద్ధ‌మ‌వుతున్నాడ‌ట‌. ఏదేమైనా బ‌న్నీ వ‌రుస‌గా స్ట్రాంగ్ లైన‌ప్ తో అడుగులు వేస్తున్నాడు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: