టాలీవుడ్ ప్రేక్షకులకు మృణాల్ ఠాకూర్ అనే పేరు కొత్తది కాదు. “సీతా రామం” సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఈ బ్యూటీ, తన అద్భుతమైన నటనతో పాటు సాఫ్ట్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కూడా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. ఆ సినిమాతోనే మృణాల్ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ రేంజ్‌లోకి వచ్చేసింది. తరువాత నేచురల్ స్టార్ నానితో చేసిన “హాయ్ నాన్న” సినిమా కూడా మంచి హిట్ సాధించడంతో ఆమె కెరీర్ దూసుకెళ్తుందనిపించింది.కానీ ఆశ్చర్యకరంగా “ఫ్యామిలీ స్టార్” మాత్రం మృణాల్‌కి పెద్ద షాక్ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆమె కెరీర్‌కు కాస్త బ్రేక్ పడింది. టాలీవుడ్‌లో కొత్త కొత్త అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఒకే ఒక్క తెలుగు సినిమా “డెకాయిట్”. ఈ ప్రాజెక్ట్‌తో మృణాల్ మరోసారి తన టాలీవుడ్ మార్క్ రీఎంట్రీ ఇవ్వాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


ఇంతలో మరో ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అల్లు అర్జున్అట్లీ కాంబినేషన్‌లో రూపొందబోయే భారీ ప్రాజెక్ట్‌లో ఓ కీలక పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను సంప్రదించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తకు ఇంకా అధికారిక ధృవీకరణ లేకపోయినా, ఫ్యాన్స్ మాత్రం ఈ జంటను స్క్రీన్‌పై చూడాలని బాగా ఎగ్జైట్ అవుతున్నారు.తెలుగులో ఇలా కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ, మృణాల్ బాలీవుడ్‌లో మాత్రం బిజీగా ఉంటుంది. హిందీ సినిమాల్లో చిన్నా పెద్దా పాత్రలని ఎంచుకోవడంలో ఆమె ఎలాంటి సంకోచం చూపదు. ఎందుకంటే ఆమె నమ్మకం నటనలో వైవిధ్యం ఉండాలి అనేదే. అయితే, ఆమె మనసులో మాత్రం టాలీవుడ్‌కే ప్రత్యేక స్థానం ఉంది. “తెలుగు ప్రేక్షకులు నన్ను ఎలాంటి ప్రేమతో ఆహ్వానించారో నాకు బాగా తెలుసు. అందుకే ఇక్కడ మంచి పాత్ర దొరికితే ఎప్పుడూ చేయడానికి సిద్ధంగా ఉంటాను” అని మృణాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.



ఆమె నటన, అందం, ఆప్యాయత — ఈ మూడు కలిపి టాలీవుడ్ ఆడియన్స్‌కి ప్రత్యేకంగా కనెక్ట్ అయ్యాయి. అభిమానులు కూడా మృణాల్‌కి మళ్లీ మళ్లీ మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆమె స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ ఒక సాఫ్ట్ మేజిక్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు అన్ని చూపులు “డెకాయిట్” సినిమా మీదే ఉన్నాయి. ఈ మూవీ విజయవంతమైతే మృణాల్‌కి మళ్లీ పెద్ద డోర్లు తెరుచుకునే అవకాశం ఉంది. నిర్మాతలు, దర్శకులు మరోసారి ఆమె వైపు చూడడం ఖాయం. అంతేకాదు, భవిష్యత్తులో తమిళ సినిమాల్లో కూడా అడుగు పెట్టాలని మృణాల్ ప్రణాళికలు వేస్తోందట. సౌత్ మొత్తానికి ఆమె ఓ బలమైన ప్రెజెన్స్‌గా మారడమే ఆమె లేటెస్ట్ లక్ష్యం.



ఇంత టాలెంట్, ఇంత బ్యూటీ, ఇంత డెడికేషన్ ఉన్నా — కొన్నిసార్లు టైమ్ అనేది అడ్డుగా వస్తుంది. అందుకే “అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని ఉంటే ఇంతే..!” అని ప్రజలు అంటారు. కానీ మృణాల్ ఠాకూర్ విషయంలో మాత్రం ఆ శని ఎక్కువకాలం ఉండదని ఇండస్ట్రీ టాక్. త్వరలోనే ఆమె మళ్లీ తన గ్లామర్‌, నటనతో టాలీవుడ్‌ను మాయ చేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: