ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. అందులో ఒక పాత్ర మాస్ లుక్‌లో ఉంటే, మరోటి క్లాస్ టచ్‌తో ఉంటుందట. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే సెకండ్ రోల్‌కు సంబంధించిన సీన్స్‌ను ఈ యూరప్ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఇప్పటి వరకు తీసిన ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి సినిమాలతో తన మార్క్ ను నిరూపించాడు. కానీ ‘డ్రాగన్’ మాత్రం తన కెరీర్ బెస్ట్ ప్రాజెక్ట్‌గా నిలవాలని ఆయన ఫిక్స్ అయ్యాడు. అందుకే స్క్రిప్ట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. యాక్షన్‌తో పాటు ఎమోషన్, సస్పెన్స్, డ్రామా – అన్నీ మేళవించిన స్టోరీలైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ భారీ సినిమాని నిర్మిస్తున్నాయి.
బడ్జెట్ విషయంలో ఎలాంటి కట్టుబాట్లు లేవని, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై వర్క్ ప్రారంభించాడు. ఆయన స్కోర్ ఈ సినిమాకి మరో లెవెల్ ఎనర్జీ ఇవ్వబోతుందని టీమ్ నమ్మకం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ దృష్టిలో ‘డ్రాగన్’ అనేది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషన్. ‘డీకే బాస్’ స్టైల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వం, ఎన్టీఆర్ యాక్షన్ మాస్ అవతార్ – ఈ కాంబినేషన్ టాలీవుడ్ హిస్టరీలో కొత్త రికార్డులు సృష్టించేలా ఉందనే అంచనాలు ఉన్నాయి. మొత్తానికి యూరప్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ‘డ్రాగన్’ ఫ్లైట్, బాక్సాఫీస్ పై ఫైర్ ఎగురవేయడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి