తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ ప్రస్తుతం జన నాయగన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ కి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ లో బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు ఏకంగా 110 కోట్ల ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

సినిమా యొక్క ఓవర్ సిస్ హక్కులను ఫార్స్ ఫిలిమ్స్ సంస్థ దాదాపు 75 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా యొక్క తమిళ నాడు థియేటర్ హక్కులను రోమియో పిక్చర్స్ సంస్థ వారు ఏకంగా 100 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ కి కేరళ లో కూడా అద్భుతమైన క్రేజ్ ఉంటుంది. దానితో ఈ సినిమా యొక్క కేరళ హక్కులను ఓ ప్రముఖ సంస్థ ఏకంగా 15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ కి పర్వాలేదు అనే స్థాయిలో క్రేజ్ ఉంది. దానితో ఈ మూవీ కి తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా కర్ణాటక , నార్త్ ఇండియా థియేటర్ హక్కులు మరియు సాటిలైట్ హక్కులతో కలుపుకొని ఈ మూవీ కి విడుదలకు ముందే 400 కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉంది అని , దానితో ఈ సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్ ను తీసుకురాబోతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: