ఇటీవల అనిరుధ్ ఇచ్చిన కొన్ని సినిమాల పాటలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆయన మీద కొంత విమర్శలు వచ్చాయి. ‘ కూలి ’ చిత్రంలో ‘ మౌనికా ’ ఒక్కటే క్లిక్ అవ్వడం కూడా ఆ ఆందోళనను పెంచింది. అందుకే ఇప్పుడు ‘జన నాయకుడు’ మీద మ్యూజిక్ పరంగా కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా విషయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా ‘ భగవంత్ కేసరి ’ రీమేక్ అన్న ప్రచారం చాలా కాలంగా సాగుతోంది. సంక్రాంతి ఈవెంట్‌లో నటుడు వీటి గణేష్ అదే విషయాన్ని చెబుతుండగా దర్శకుడు హెచ్. వినోత్ మేనేజ్ చేయడం కూడా ఈ రూమర్స్‌కి బలం చేకూర్చింది. ఇప్పుడు వచ్చిన సాంగ్‌లో విజయ్, పూజా హెగ్డే, మమిత బైజు ల డాన్స్ స్టెప్స్ చూస్తుంటే బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల కాంబినేషన్ గుర్తుకు వస్తోందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇక టీజర్‌లో విజయ్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో కనిపించడం కూడా ఈ రీమేక్ చర్చలకి మరింత ఊతం ఇచ్చింది. అయితే ఇన్‌సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు హెచ్ వినోత్ భగవంత్ కేసరి నుంచి కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే తీసుకుని కథను పూర్తిగా మార్చేశాడట. అంతేకాదు, వర్తమాన రాజకీయ పరిస్థితులకు తగినట్లు పాలిటికల్ యాంగిల్ కూడా జోడించాడని కోలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. అది నిజమైతే, ఈ కథా రూపకల్పనలో దర్శకుడు అనిల్ రావిపూడికి పరోక్షంగా క్రెడిట్ వెళ్లినట్టే. ప్రస్తుతం వాయిదా వార్తలు తిరుగుతున్నా, మూవీ టీమ్ పోస్టర్లతో పాటు పాటలో కూడా జనవరి 9న రిలీజ్ డేట్‌ని మళ్లీ ఖరారు చేసింది. అంటే ఈ సంక్రాంతికి విజయ్ ‘జన నాయకుడు’ మరియు ప్రభాస్ ‘రాజా సాబ్’ మధ్య భారీ క్లాష్ ఖాయమైంది. ఎవరు బాక్సాఫీస్ యుద్ధంలో గెలుస్తారో చూడటానికి సినీప్రేమికులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి