తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక పాటలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ పాడడం ఈ సినిమా పైన మరింత ఆసక్తిని పెంచేలా చేస్తోంది. శృతిహాసన్ పాడిన తీరుచూస్తూ ఉంటే గూస్ బంప్స్ తెప్పించేలా కనిపిస్తోంది. శృతిహాసన్ ఈ పాటలో తన మ్యూజికల్ టాలెంటుని మరొకసారి చూపించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా సంచారి అనే ఈ పాటలో మహేష్ బాబు పాత్ర వీరత్వాన్ని ఆమె వర్ణిస్తూ వివరించిన తీరు అద్భుతంగా కనిపిస్తోంది. ఈ పాట అభిమానులను కూడా విపరీతంగా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
లిరికల్ వీడియోలో శృతిహాసన్ పాడుతున్న విజువల్స్ కూడా అద్భుతంగా చూపించారు. ఆమె పాడుతున్న తీరును బట్టి చూస్తూ ఉంటే అభిమానులకు పూనకాలు తెప్పించేలా కనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడుగా పేరు సంపాదించిన కీరవాణి అందిస్తున్న ట్యూన్ కూడా ఈ పాటకు మరింత బలాన్ని చేకూర్చేలా చేస్తోంది. వాస్తవంగా ప్రియాంక చోప్రా కి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజున విడుదల చేస్తారని వార్తలు వినిపించాయి. మరి ఇందుకు సంబంధించి రాజమౌళి సడన్ ట్విస్ట్ ఇస్తారేమో చూడాలి. ఈ సినిమా సుమారుగా రూ .1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. గత సినిమాలలో ఎప్పుడు చేయని విధంగా రాజమౌళి మహేష్ బాబు సినిమాకి చేస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి