సింగం 2లో హన్సిక సెకండ్ హీరోయిన్ గా నటించగా సింగం 3లో సెకండ్ హీరోయిన్గా శృతిహాసన్ కనిపించారు. కానీ మెయిన్ హీరోయిన్ గా మాత్రం అనుష్కనే నటించింది. సింగం(యముడు) చిత్రంలో అనుష్క చెల్లెలి పాత్రలో నటించిన ఈ అమ్మడు అందరికీ గుర్తుంటుంది. తన అందంతో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈమె ఎవరో తెలిస్తే అందరూ ఆశ్చర్యపోతారు. ఈమె పేరు ప్రియా, కోలీవుడ్ లోనే స్టార్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అట్లీ భార్య. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అట్లీ భార్య ప్రియా కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. ప్రియా నిర్మాతగా కూడా పలు సినిమాలకు వ్యవహరించడమే కాకుండా వ్యాపారవేత్తగా కూడా బాగా పేరు సంపాదించింది. ముఖ్యంగా తన భర్త కాస్ట్యూమ్స్ డిజైనర్ గా కూడా వ్యవహరిస్తోంది. అయితే ఈ మధ్యకాలంలో సినిమాలలో నటించడం తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ భార్య అనుష్క సినిమాలో నటించిందని తెలిసి ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి సైన్స్ ఫిక్షన్ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా భారీగానే ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి