హీరోయిన్ గా త్రిప్తి డిమ్రి, విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారని వార్తలు బయటకు వచ్చి అభిమానుల్లో ఉత్సాహం నింపాయి. అంతేకాదు, ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఆడియో గ్లింప్స్ సోషల్ మీడియాలో సునామీలా వైరల్ అవ్వడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే గత కొన్ని నెలలుగా ‘స్పిరిట్’ గురించి మరో భారీ రూమర్ నడుస్తూనే ఉంది — అదేంటంటే, మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో నటిస్తున్నారట! ప్రభాస్ కు తండ్రి పాత్రలో చిరు కనిపించబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ముఖ్యంగా సందీప్ రెడ్డి వంగా స్వయంగా చిరంజీవి వీరాభిమాని కావడంతో, ఈ వార్తకు బలం చేకూరింది. వంగా ఆఫీసులో చిరు ఫోటో ఉండడం, ఇటీవల వంగా – చిరు మీటింగ్ కూడా ఈ రూమర్స్ ను మరింత బలపరిచాయి.
కానీ, తాజాగా వంగా ఈ రూమర్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాడు. తనకు సైలెంట్‌గా సపోర్ట్ చేస్తున్న చిన్న సినిమా ‘జిగ్రీస్’ ప్రమోషన్ల సందర్భంగా హీరోలు వంగా ఆఫీస్‌కి వెళ్లినప్పుడు స్పిరిట్ గురించి ప్రశ్నించారు. దానికి వంగా స్పందిస్తూ – “అవన్నీ రూమర్స్ మాత్రమే. చిరంజీవి గారు స్పిరిట్ సినిమాలో లేరు. ఆయనతో మాత్రం వేరే సోలో ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచన ఉంది” అని క్లారిటీ ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాటలతో స్పిరిట్ లో చిరు ఎంట్రీపై ఉన్న సందేహాలన్నీ తొలగిపోయాయి. కానీ, వంగా – చిరు కాంబినేషన్‌లో రాబోయే సినిమా ఎలా ఉంటుందోనన్న ఆసక్తి మాత్రం మరింత పెరిగిపోయింది. మరోవైపు ప్రభాస్ – వంగా కాంబోలో వస్తున్న ‘స్పిరిట్’ పాన్ ఇండియా స్థాయిలో మాస్ ఎమోషన్ తో కూడిన పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని సినీ వర్గాల సమాచారం. అభిమానులు ఇప్పుడు ఒక్కటే చెబుతున్నారు — “డార్లింగ్ వంగా కాంబో కుదిరిందంటే.. బాక్సాఫీస్ లో బ్లాస్ట్ ఖాయం!”
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి