టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు నటించిన సినిమా విడుదల అవుతుంది అంటే చాలు బాక్సా ఫీస్ దగ్గర సందడి వాతావరణం నెలకొంటుంది అనే విషయం మన అందరికీ తెలిసింది. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన అనేక మూవీ లను రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. కొన్ని సినిమాలకు రీ రిలీజ్ లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది.

మరి ముఖ్యంగా మహేష్ బాబు నటించిన సినిమాలకు రీ రిలీజ్ లో భాగంగా మంచి రెస్పాండ్ జనాల నుండి లభిస్తుంది. అలాగే మంచి కలెక్షన్లు కూడా ఆయన సినిమాలకు బాక్సా ఫీస్ దగ్గర దక్కుతున్నాయి. మహేష్ నటించిన ఓ సినిమా ఇప్పటికే రీ రిలీజ్ అయ్యి అద్భుతమైన కలెక్షన్లను వసులు చేసింది. అలాగే ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. ఆ సినిమాను మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం కూడా ఆ సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన బిజినెస్ మెన్ అనే సినిమలో హీరో గా నటించాడు. 

కాజల్ అగర్వాల్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ని కొంత కాలం క్రితం రీ రిలీజ్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ ని మళ్లీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను నవంబర్ 29 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ రీ రీ రిలీజ్ ఆంధ్ర థియేటర్ హక్కులను వారాహి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: