సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది బ్యూటీలు కొన్ని పాత్రల్లో నటించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్టార్ ఈమేజ్ ఉన్న సమయంలో హీరోయిన్లు తల్లి పాత్రలో నటించడానికి , ఆంటీ పాత్రలలో నటించడానికి పెద్దగా ప్రాధాన్యత చూపరు. అందుకు ప్రధాన కారణం అలాంటి పాత్రలలో నటించినట్లయితే ఆ తర్వాత సినిమాల్లో వరుస పెట్టి అలాంటి పాత్రల్లో అవకాశాలే వస్తాయి అని , దానితో ఆ పాత్రలో చాలా గొప్పగా నటించే అవకాశం ఉన్న అందుకు వారు అంగీకరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి ఈమె ఒక బిడ్డకు తల్లి పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ మూవీ లోని మీనాక్షి చౌదరి నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు కూడా దక్కాయి. 

తాజాగా మీనాక్షి చౌదరి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ ... నేను నటించిన లక్కీ భాస్కర్ సినిమా కథ నాకు బాగా నచ్చింది. కానీ ఆ సినిమాలో నేను తల్లి పాత్రలో నటించాను. మరోసారి అలాంటి పాత్రలో అవకాశం వచ్చిన ఆ సినిమాలో నటించను అని ఆమె చెప్పింది. ప్రస్తుతం మీనాక్షి చౌదరి , నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందుతున్న అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాతో పాటు మీనాక్షి చౌదరి , నాగ చైతన్య హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో పొందుతున్న మరో సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Mc