నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ సినిమా అఖండ 2 తాండవం. అఖండ సూపర్ డూపర్ హిట్ కావడం .. ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 - తాండవం తెరకెక్కుతుండడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా నుంచి అభిమానులు ఫస్ట్ సింగిల్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ సినిమా ఆల్బమ్ లో తక్కువ పాటలే ఉన్నాయన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది.
సినిమా రిలీజ్ కి చాలా తక్కువ టైం ఉన్న నేపథ్యంలో మొదటి సాంగ్ వస్తుంది. సో మిగతా ఎన్ని పాటలు ఉన్నాయా ? ఎప్పుడు వస్తాయి ? అన్నది తెలియడం లేదు. ఇండస్ట్రీ వర్గాల్లో అయితే ఆల్బమ్ లో తక్కువ పాటలే ఉండి ఉంటాయని చర్చించుకుంటున్నారు. ఎక్కువ పాటలు ఉంటే ఇప్పటికే వరుస పెట్టి రిలీజ్ చేయాలి కదా ? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఫస్ట్ సింగల్ తో పాటు అప్ డేట్ల రిలీజ్ విషయంలో బాగా ఆలస్యం అవుతోందని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కి సంగీతం థమన్ అందిస్తున్నాడు. అలాగే 14 రీల్ ప్లస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి ..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియ జేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి