చరిత్ర సృష్టించిన 'పోకిరి', తెలుగు సినిమా ఫ్యామిలీ ఫీల్ అంటే 'మురారి', మాస్ ట్రెండ్‌సెట్టర్ 'ఒక్కడు'.. ఇలా లెక్కలేనన్ని బ్లాక్‌బస్టర్‌లకు కేరాఫ్ అడ్రస్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు! అయితే.. కింగ్ ఆఫ్ కలెక్షన్స్ అయిన మహేష్ కెరీర్‌లో సైతం ఊహించని షాకులు తగిలాయి. భారీ అంచనాలతో, డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో, అన్నదమ్ముల అనుబంధం (బ్రదర్-సిస్టర్ సెంటిమెంట్)తో వచ్చిన 'అర్జున్‌ మూవీ.. బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. దాదాపు 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మెగా మూవీ, థియేటర్లలో తుస్సుమన్నా.. టీవీల్లో మాత్రం ఇప్పటికీ సంచలనం సృష్టిస్తుంది! ఇప్పటికీ ఈ సినిమా పాటలు, యాక్షన్ సీన్లు యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతూ.. ఈ చిత్రానికి ఉన్న మాస్ కల్ట్ ఫాలోయింగ్‌ను తెలియజేస్తున్నాయి. ఫ్లాప్ పడినా.. 'అర్జున్' సెంటిమెంట్ పవర్ అంతా ఇంతా కాదు!


'అర్జున్' ఎంత పెద్ద స్కేల్‌లో తీశారో, దానికి తగ్గట్టుగానే నటీనటుల ఎంపిక జరిగింది. ఇందులో హైలైట్ అయిన మరో ముఖ్యపాత్ర ఆండాళ్! విలన్ షేడ్స్ ఉన్న ఆ పాత్రకు ప్రాణం పోసింది ఒకప్పటి తోపు హీరోయిన్ సరిత. తెలుగులో కథానాయికగా తనకంటూ తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సరిత.. సెకండ్ ఇన్నింగ్స్‌లో విలన్ పాత్రలకూ సై అంది. 'అర్జున్'లో పవర్ ఫుల్ విలనీ పండించిన ఆండాళ్ పాత్రలో సరిత నటన.. సినిమాకు అసలైన కిక్ ఇచ్చింది. తన విలక్షణ నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.



అయితే.. ఈ పవర్ హౌస్ యాక్ట్రెస్ సరితకు సంబంధించిన మరో సంచలన విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సరిత సొంత చెల్లెలు కూడా ఒకప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్! ఆమె పేరు విజీ చంద్రశేఖర్. ఈ పేరు వెంటనే గుర్తు రాకపోవచ్చు కానీ.. 'అఖండ' సినిమాలో బాలకృష్ణకు తల్లిగా నటించి అదరగొట్టిన ఆర్టిస్ట్ ఈమే! సరిత 'అర్జున్స‌లో సూప‌ర్ స్టార్‌కి విలన్‌గా నటిస్తే, ఆమె చెల్లెలు విజీ చంద్రశేఖర్.. నందమూరి నటసింహం బాలకృష్ణకు తల్లిగా పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం. 1991లో వచ్చిన 'కలియుగం' సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన విజీ.. దాదాపు 30 ఏళ్ల భారీ బ్రేక్ తర్వాత.. *అఖండ'తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.



ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అయిన విజీ.. ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది'లో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఒకప్పుడు అగ్ర కథానాయికలుగా వెలుగు వెలిగి.. ఆ తర్వాత పవర్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిన ఈ అక్కాచెల్లెళ్లు సరిత, విజీ చంద్రశేఖర్ ఇద్దరూ.. తెలుగు సినిమా చరిత్రలో తమదైన ముద్ర వేశారు. మహేష్ బాబు 'అర్జున్' విలన్ సిస్టర్.. బాలయ్య 'అఖండ' తల్లి! ఈ మాస్ కనెక్షన్ ఈనాటికీ సినీ అభిమానులకు షాక్ ఇస్తుంది!



మరింత సమాచారం తెలుసుకోండి: