టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోలలో నందమూరి నట సింహం బాలకృష్ణ ఒకరు. బాలయ్య ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. బాలకృష్ణ ఆఖరుగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి కొల్లి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా బాబి కొల్లి ఓ సినిమా ఈవెంట్లో పాల్గొన్నాడు. ఆ ఈవెంట్లో భాగంగా ఓ నటి గురించి ఆయన కొన్ని కామెంట్లు చేశాడు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా చాందిని చౌదరి "సంతాన ప్రాప్తిరస్తు" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాను రేపు అనగా నవంబర్ 14 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఈవెంట్ కు బాబి విచ్చేశాడు.

ఆ ఈవెంట్లో భాగంగా బాబి మాట్లాడుతూ ... బాలకృష్ణ గారు హీరోగా నటించిన డాకు మహారాజ్ సినిమాకు నేను దర్శకత్వం వహించాను. ఆ సినిమాలో చాందిని చౌదరి కూడా నటించింది. ఇక సినిమా స్టార్ట్ కాక ముందు చాందిని చౌదరి ని డాకు మహారాజ్ సినిమాలో అనుకున్నప్పుడు ఆమె పాత్ర చాలా పెద్దగా అనుకున్నాను. అదే పాత్రను ఆమెకు వినిపించాను. ఆమె ఓకే చెప్పింది. కానీ ఆ తర్వాత కొన్ని పరిస్థితుల కారణంగా ఆమె పాత్ర ప్రాధాన్యతను తగ్గించాల్సి వచ్చింది. కానీ ఆమె పాత్ర ప్రాధాన్యతను ఆ సినిమాలో తగ్గించిన ఆమె ఏ మాత్రం ఫీల్ కాకుండా ఆ మూవీ లో నటించింది అని బాబి తాజాగా చెప్పుకొచ్చాడు. తాజాగా బాబి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: