ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వేల కళ్లతో ఎదురు చూస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’ గ్రాండ్ ఈవెంట్‌ మరికొద్ది సేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా ప్రారంభం కానుంది. ఈ వేడుక కోసం అభిమానుల్లో నెలల నుంచే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఆ ఉత్సాహం ఎలా ఉందంటే—రామోజీ ఫిల్మ్ సిటీ వైపు భారీగా జనసంద్రం తరలివస్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశం నలుమూలల నుండి, విదేశాల నుంచే ప్రత్యేకంగా ఫ్యాన్స్‌ ఈ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడడానికి హైదరాబాద్‌కు చేరుతున్నారు. మహేష్–రాజమౌళి కాంబినేషన్‌పై ప్రజల్లో ఉన్న అపార ఆసక్తి ఏ స్థాయిలో ఉందో ఇదొక్కటే చెబుతుంది.


ఇలాంటి హైప్ మధ్య, కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టైటిల్ రివీల్‌ను అధికారికంగా చేశారు. సోషల్ మీడియాలో ఎనిమిది నెలలుగా గట్టిగా వినిపిస్తున్న “వారణాసి” అనే టైటిల్‌నే దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి చివరకు ఖరారు చేశారు. నేడు జరుగుతున్న ‘గ్లోబ్ ట్రాటర్’ గ్రాండ్ ఈవెంట్ వేదికగా ఈ టైటిల్‌తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ లుక్‌ను కూడా అబ్బురపరిచే విధంగా ఆవిష్కరించారు.విడుదలైన కొద్ది సెకన్లలోనే “వారణాసి” శబ్దం సోషల్ మీడియాలో  ట్రెండింగ్‌లో దూసుకుపోయింది.

 

జక్కన్న మార్క్ విజువల్స్‌ అంటే ప్రపంచమే తెలుసు. మరోవైపు మహేష్ బాబు పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ అంటే అభిమానులకు పండుగలా ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్‌ కలిసి వస్తే ఏమవుతుందో ఇప్పటివరకు మనం కేవలం ఊహించుకున్నాం. కానీ ఈ పోస్టర్ చూసిన తర్వాత మాత్రం—ఇది బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ రేంజ్ కాదు… దానికంటే మరింత భారీ స్థాయిలో, పునాది కదిలించే రేంజ్‌లో ఉండబోతోందని అభిమానులు నమ్మకం పెంచుకుంటున్నారు.మొత్తం మీద, రాజమౌళి ఈసారికి మాటలు చెప్పకుండా—పొగరుగా, డేరింగ్‌గా, స్ట్రెయిట్‌గా ర్యాంప్ మీద నడిచినట్లే పెద్ద అటిట్యూడ్‌తో ప్రూవ్ చేశాడు: “ఇదే అసలు నా సినిమా… ఇది మొదటిదే… ఇంకా అసలు అసలు మొదలైతే ఏమవుతుందో ఊహించండి” అని చెప్పిన్నట్టుగా ఉంది. మహేష్ లుక్ ఆధారంగా చూస్తే—ఈ సినిమా ఇండియన్ సినిమా స్టాండర్డ్‌ను మరో పది మెట్లు పైకి తీసుకెళ్లడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: