ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు అభిమానుల ఆశలకి ఈరోజుతో తెరపడిపోయింది.చాలా రోజులుగా మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమా టైటిల్ ఏంటి.. కథ ఏంటి..మహేష్ బాబు ని ఇందులో ఏ విధంగా చూపించబోతున్నారు అనేది గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రివీల్ చేశారు. అలా మొదట సినిమా పేరు వారణాసి అని అధికారికంగా ప్రకటించడంతోపాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు ఎద్దుపై త్రిశూలం పట్టుకొని వస్తున్నట్టు చూపించారు. దీంతో కథ పూర్తిగా దైవత్వం బ్యాక్ డ్రాప్ తో రాబోతుందని అందరూ అనుకుంటున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈ సినిమాకి నిర్మాతగా చేసిన కేఎల్ నారాయణ ఒకే ఒక్క మాటతో మహేష్ బాబు అభిమానుల మనసు దోచేశారు. 

వారణాసి మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అలాగే రాజమౌళి తనయుడు కార్తికేయ కూడా ఈ సినిమాకి సహ నిర్మాతగా చేస్తున్నారు. అయితే ఈ గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్లో కేఎల్ నారాయణ మాట్లాడుతూ.. రాజమౌళితో సినిమా చేయాలని 15 ఏళ్ల క్రితమే చెప్పాను. ఆయన 15 ఏళ్ల క్రితమే చేస్తానని మాట ఇచ్చారు. కానీ సినిమా రావడానికి ఇంత సమయం పట్టింది. అలా ఇప్పుడు సినిమా రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే కృష్ణ గారిలాగే మహేష్ బాబు కూడా నిర్మాతల హీరో అంటూ నిర్మాత కే ఎల్ నారాయణ మాట్లాడారు.అయితే కేఎల్ నారాయణ మాటలు చాలామంది మహేష్ బాబు ఫ్యాన్స్ ని ఆకర్షించాయి. ఒక్క మాటతో మా మనసులు దోచేసావ్ పో అంటూ మహేష్ ఫ్యాన్స్ నిర్మాతను పొగుడుతున్నారు.

అయితే నిర్మాత కృష్ణ తో మహేష్ బాబును పోల్చడానికి కారణం ఒకప్పుడు దివంగత నటుడు కృష్ణ కూడా నిర్మాతలకు అనుకూలంగా ఉండేవారు.. అలా నిర్మాతల హీరోగా కృష్ణ పేరు తెచ్చుకున్నారు. సినిమా ప్లాఫ్ అయితే నిర్మాతలకి డబ్బు తిరిగి ఇచ్చేవారు. నిర్మాతలకు కష్టం కాకూడదని సినిమాని అనుకున్న సమయానికి పూర్తి చేసేవారు. అయితే అచ్చం కృష్ణ లాగే మహేష్ బాబు కూడా సినిమా ఫ్లాప్ అయితే రెమ్యూనరేషన్ తిరిగి ఇవ్వడంతో పాటు నిర్మాతలకు అన్ని విధాలుగా సహకరిస్తారు. అందుకే కేఎల్ నారాయణ ఈ విషయంలో కృష్ణతో మహేష్ బాబుని పోల్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: