కొద్దిసేపటి క్రితమే చిత్రబృందం విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ వీడియో కోసం రాజమౌళి వ్యక్తిగతంగా దాదాపు నెలరోజులపాటు తిండి–నిద్ర మాని పనిచేసారనే సమాచారం అందుతోంది. ఇప్పటివరకు తెలుగు సినీ చరిత్రలో ఎవ్వరూ చేయని రేంజ్‌లో ఈ వీడియో ఉండాలని ఆయన సంకల్పించారు. అందుకే 100 అడుగుల భారీ ళేడ్ స్క్రీన్ ఏర్పాటుచేసి, ప్రేక్షకులకు లైవ్ అనుభూతి కలిగించేలా అన్ని ఏర్పాట్లు చేశారు.అయితే అనుకున్నట్టుగా జరగాల్సిన ఈ ప్రణాళికలో అకస్మాత్తుగా టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో, వీడియో విడుదల అరగంట ఆలస్యమైంది. అంతే కాకుండా గ్లింప్స్ వీడియో విడుదలైన తర్వాత కూడా, అది అభిమానులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయిందన్న అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. రాజమౌళి సినిమా అంటే ఉండే ఆ “ఓరేంజ్ ఈ రేంజ్” లాంటి మ్యాజిక్, మహేష్ బాబుతో వస్తున్న ప్రాజెక్ట్‌కు తగిన విజువల్స్ ఈ గ్లింప్స్‌లో కనిపించలేదని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్టేజ్‌పైకి వచ్చిన రాజమౌళి భావోద్వేగంతో మాట్లాడుతుండగా, కళ్లల్లో కన్నీళ్లు కూడా కనిపించాయి. “అసలు దేవుడు ఉన్నాడా?” అనే భావోద్వేగపూరిత వాక్యాలతో ఆయన మనసులో ఉన్న బాధను పరోక్షంగా బయటపెట్టారని చెబుతున్నారు. అంతగా కష్టపడి చేసిన గ్లింప్స్ ప్రేక్షకులను పూర్తిగా ఎంగేజ్ చేయకపోవడంతో రాజమౌళి తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది.ఇదిలాఉంటే, సోషల్ మీడియాలో మాత్రం “రాజమౌళి అనుకున్నది ఒకటి… అయినది మరోటి” అంటూ మీమ్స్, కామెంట్స్ రవాణా అవుతున్నాయి. రాజమౌళి నిరాశ చెందడంతో, ఇప్పుడు మహేష్ బాబు కూడా ఈ ఫలితంపై అసంతృప్తిగా ఉన్నారా? అన్న అంశం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయినా, ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే. రాజమౌళి–మహేష్ కాంబినేషన్ అంటే ఏ స్థాయి విజువల్స్, ఎలాంటి వరల్డ్ క్రియేషన్ ఉంటుందో అందరికీ తెలుసు. ఈ చిన్న విఫలతను దాటుకుని, సినిమాలో మాత్రం అద్భుతాలను చూపిస్తారనే నమ్మకం అభిమానుల్లో ఇంకా బలంగా ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి