అంతేకాకుండా, ఆ నకిలీ అకౌంట్ల ద్వారా ఫోటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు, ఇతర సినీ వర్గాలకు మెసేజ్‌లు పంపుతూ “పని కావాలి” అంటూ అభ్యర్థనలు చేస్తున్నాడనే విషయం తన దృష్టికి వచ్చినట్లు ఆమె పేర్కొన్నారు.ఈ ఘటనపై స్పందించిన అదితి రావు హైదరీ స్పష్టంగా హెచ్చరిస్తూ—“నా పేరుతో వస్తున్న ఆ మెసేజ్‌లు పూర్తిగా నకిలీవి. దయచేసి వాటిని నమ్మవద్దు. ఆ అకౌంట్లు నావి కావు. నా ఫోటోలు, నా పేరు ఉపయోగించి ఎవరికైనా మెసేజ్‌లు వస్తే వెంటనే బ్లాక్ చేసి రిపోర్ట్ చేయండి. సంబంధిత వ్యక్తిపై నేను చట్టపరమైన చర్యలు తీసుకుంటాను,” అని ఘాటుగా స్పందించారు.
తాను ఉపయోగిస్తున్న సోషల్ మీడియా ఖాతాలన్నీ వెరిఫైడ్ అయినవే అని ఆమె అభిమానులకు తెలియజేశారు. వెరిఫైడ్ బ్యాడ్జ్ లేని ఇతర ప్రొఫైల్‌లు తనవి కావని స్పష్టంగా చెప్పారు. నకిలీ అకౌంట్లను గుర్తించిన వెంటనే రిపోర్ట్ చేసి తొలగించడంలో సహకరించాలని అభిమానులను, నెటిజెన్లను ఆమె కోరారు. ఈ ఘటనను మీడియాతో పంచుకోవడం ద్వారా సోషల్ మీడియాలో పెరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలపై ప్రజల్లో మరింత అవగాహన పెరిగి, ఇలాంటి మోసాలకు ఎవరూ బలి కాకుండా ఉండాలని అదితి అభిలషిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖుల పేర్లపై సృష్టిస్తున్న నకిలీ అకౌంట్ల సంఖ్య పెరుగుతున్న ఈ కాలంలో, ఆమె చేసిన ఈ హెచ్చరిక అనేక మందికి అప్రమత్తత కలిగించేలా మారింది. కాగా అదితి ..హీరో సిద్ధు ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి