అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. "రాజు వెడ్స్ రాంబాయి" చిత్రాన్ని డా.నాగేశ్వరరావు పూజారి సమర్పణలో డోలాముఖి సుబల్టర్న్ ఫిలింస్, మాన్ సూన్స్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మిస్తున్నారు. సాయిలు కంపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ..
ఖమ్మం, వరంగల్ జిల్లాల మధ్య జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారగా దర్శకుడు సాయిలు "రాజు వెడ్స్ రాంబాయి" సినిమాకు స్క్రిప్ట్ చేశాడు. అతను నా దగ్గర వర్క్ చేస్తుండేవాడు. ఒకరోజు ఈ కథ నాకు నెరేట్ చేశాడు. వినగానే నన్ను కలచివేసింది. పరువు హత్యల గురించి మనం విన్నాం, ఇంకొన్ని విధాలుగా పరువు హత్య ఘటనలు జరగడం చూశాం. కానీ ఇలాంటి దుర్మార్గం ఏ ప్రేమకథలోనూ జరగలేదు అనిపించింది. ఇది వాస్తవ ఘటన నేపథ్యంగా సాగే సినిమా అయినా దర్శకుడు మెయిన్ స్ట్రీమ్ అప్పీల్ ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది.

ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ అయితేనే న్యాయం జరుగుతుంది అనిపించింది ప్రొడ్యూసర్ గా మారాను. అప్పటికే ఈటీవీ వాళ్లు నన్ను ఏదైనా ప్రాజెక్ట్ ఉంటే అసోసియేట్ కమ్మని అడిగారు. నేను "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ గురించి చెప్పాను. వాళ్లు ఈ సినిమా చేస్తామంటూ ముందుకు వచ్చారు. ఆ తర్వాత వంశీ నందిపాటి, బన్నీవాస్ లాంటి రెప్యుటెడ్ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ మా మూవీతో అసోసియేట్ అయ్యారు. వీళ్లంతా కలిసి చేతులు కలపడం వల్ల మా సినిమా ప్రేక్షకుల దగ్గరకు సరైన విధంగా రీచ్ అవుతోంది.

సురేష్ బొబ్బిలి, నేను, మిట్టపల్లి సురేందర్ ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ పడుతున్నప్పటి నుంచి స్నేహితులం. సురేష్ బొబ్బిలి అయితేనే ఇలాంటి రా అండ్ రస్టిక్ స్క్రిప్ట్ కు మంచి మ్యూజిక్ ఇవ్వగలడు అనిపించింది. నేను రూపొందించిన విరాటపర్వం సినిమా కూడా వాస్తవ ఘటనల నేపథ్యంగానే సాగుతుంది.

బేబి, 7జీ బృందావన్ కాలనీ, సైరత్, ప్రేమిస్తేలా "రాజు వెడ్స్ రాంబాయి" మూవీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుంది. నేను ప్రొడ్యూసర్ గా చేయాలని కాదు ఏదైనా మంచి కాన్సెప్ట్, పర్పస్ ఫుల్ కథ దొరికితే దాన్ని ప్రేక్షకులకు సరైన విధంగా చేర్చాలనే ప్రయత్నంలో నిర్మాతగా మారాను అన్నారు వేణు ఉడుగుల.


మరింత సమాచారం తెలుసుకోండి: