సినిమా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం కొంతమంది నటీమణులు ఎంతవరకైనా దిగజారుతారు. కానీ కొంతమంది మాత్రం వాటికి ఒప్పుకోరు.అలా తాజాగా ఓ యువ నటి తమిళ స్టార్ హీరో ధనుష్ మేనేజర్ పై చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆఫర్ ఇస్తానని చెప్పి కమిట్మెంట్ అడిగారు అంటూ ఆ నటి చేసిన కామెంట్లు మీడియాలో దుమారం సృష్టించాయి.మరి ఇంతకీ ఆమె ఎవరు అనేది చూస్తే..మాన్య ఆనంద్..టీవీ యాక్టర్ గా ఉంటూ సినిమాల్లో పలు రోల్స్ చేస్తూ కోలీవుడ్లో రాణిస్తున్న మాన్యా ఆనంద్ తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనుష్ మేనేజర్ శ్రేయస్ తనతో అసభ్యంగా బిహేవ్ చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.మాన్య ఆనంద్ మాట్లాడుతూ.. ధనుష్ నటించిన సినిమాలో ఓ రోల్ ఆఫర్ ఇస్తానని ధనుష్ మేనేజర్ నాతో చెప్పారు.

ఆఫరిస్తాను కానీ నేను చెప్పిన పని చేయాలి..కొన్ని విషయాల్లో రాజీ పడాలి అన్నారు.అవి ఏ విషయాలు చెప్పమని అడిగితే డొంక తిరుగుడు మాటలు మాట్లాడారు. దాంతో ఆయన మాటల్లో ఉన్న అర్థం ఏంటో నాకు కరెక్ట్ గా అర్థమైంది. సినిమాలో కీ రోల్ ఇస్తాను కానీ కమిట్మెంట్ ఇవ్వాలి అని అడిగారు. దాంతో నేను కోపంతో నీకెందుకు కమిట్మెంట్ ఇవ్వాలి అని అరిచేసరికి.. ఏంటి ధనుష్ సినిమాలో పాత్ర కోసం ఆ మాత్రం త్యాగం చేయలేవా అంటూ వెరైటీగా మాట్లాడారు.దాంతో ఆయన మాటలు అర్థం చేసుకున్న నేను ఇక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా అరిచాను.

ఆ తర్వాత కూల్ అంత అరవకు అంటూ ధనుష్ ఆఫీస్ లొకేషన్ నాకు షేర్ చేయడమే కాకుండా కొన్ని స్క్రిప్టులు కూడా నాకు పంపించాడు. కానీ ఇప్పటివరకు నేను ధనుష్ ఆఫీస్ కి వెళ్ళలేదు.ఆ స్క్రిప్టులు కూడా చదవలేదు. అసలు ఆ సినిమాలో నటించడం కూడా నాకు ఇష్టం లేదు. మాకు సినిమాల్లో యాక్టింగ్ చేయడం మాత్రమే వచ్చు.పడకగదిలో సుఖం అందించడానికి ఇతర పనులు చేయడానికి మేము లేం.. ఆఫర్స్ ఇస్తే నటిస్తాం కానీ దానికి ప్రతిఫలంగా కమిట్మెంట్ ఇవ్వాలంటే కుదరదు అంటూ మాన్యా ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేసింది.అయితే మాన్య ఆనంద్ చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు ధనుష్ గానీ ధనుష్ మేనేజర్ శ్రేయస్ గానీ స్పందించలేదు. ఒకవేళ స్పందిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: