ఆన్ స్క్రీన్ పై అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన జోడీలలో సుధీర్ , రష్మీ జోడి తెలుగులో అద్భుతమైన స్థానంలో ఉంటుంది. వీరిద్దరూ కూడా మొదట జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయ్యారు. జబర్దస్త్ కామెడీ షో కు రేష్మి యాంకర్ గా వ్యవహరించింది. అదే కామెడీ షో లో సుదీర్ కమెడియన్ గా పెర్ఫామ్ చేస్తూ వచ్చాడు. ఇక ఈ షో ప్రారంభం అయిన మొదట్లో వీరిద్దరి మధ్య పెద్దగా లవ్ ట్రాక్ చూపించకపోయిన ఆ తర్వాత కొన్ని ఎపిసోడ్లు ముగిసాక వీరిద్దరు జబర్దస్త్ షో లో కనిపించారు అంటే చాలు వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉన్నట్లు చూపించేవారు.

వీరు కూడా అద్భుతమైన రేంజ్ లో నటించేవారు. దానితో నిజం గానే సుదీర్ , రష్మీ లవ్ లో ఉన్నారు అని అనుకున్న వారు కూడా అనేక మంది ఉన్నారు. వీరిద్దరి లవ్ ట్రాక్ సూపర్ గా సక్సెస్ కావడంతో కేవలం జబర్దస్త్ కామెడీ షో లో మాత్రమే కాకుండా వీరిద్దరూ కలిసి ఏ షో లు చేసినా అందులో వీరి లవ్ ట్రాక్ కి సంబంధించిన కొన్ని స్కిట్ లను వేయడం జరుగుతూ వచ్చేది. వాటికి కూడా మంచి రెస్పాస్ జనాల నుండి రావడంతో షో ల నిర్వాహక బృందం కూడా వీటిపై ఎక్కువ ఫోకస్ పెట్టేవారు. ఇకపోతే కాలం మారుతున్న కొద్ది సుధీర్ ఈటీవీ ఛానల్ నుండి బయటకు వచ్చి వేరే ఛానల్ షో లలో పార్టిసిపేట్ చేయడం మొదలు పెట్టాడు.

ఇక రష్మీ మాత్రం ఈటీవీ లోనే కంటిన్యూ అవుతూ వస్తుంది. దానితో వీరిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఎప్పుడైతే సుధీర్ వేరే ఛానల్ కు వచ్చాడో వీరిద్దరి మధ్య షో లు రాకపోవడంతో వీరి మధ్య గ్యాప్ పెరిగింది అని చాలా మంది భావించారు. ఇక వీరు కూడా ఎక్కువగా షో లు కలిసి చేయకపోవడం , ఏదో ఒకటి , రెండు సార్లు అలా కనిపిస్తూ రావడంతో సుధీర్ , రష్మీ మధ్య గ్యాప్ వచ్చింది అని , వీరిద్దరి లవ్ ట్రాక్ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్లే అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: