ఈ నెల అనగా నవంబర్ 21 వ తేదీన రాజు వెడ్స్ రాంబాయి అనే సినిమా థియేటర్లలో విడుదల కాబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ను మేకర్స్ చాలా సైలెంట్ గా పూర్తి చేశారు. కొన్ని రోజుల క్రితం నుండి ఈ మూవీ కి సంబంధించిన చిత్రాలను విడుదల చేయడం మొదలు పెట్టారు. ఇక ఈ మూవీ యొక్క ప్రచార చిత్రాలు ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టు కోవడంతో ఒక్క సారిగా ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడడంతో చాలా మంది ఈ మూవీ ని ఎంత బడ్జెట్ తో రూపొందించారు అనే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని కేవలం రెండు కోట్ల బడ్జెట్ తోనే రూపొందించినట్లు తెలుస్తోంది.

ఇకపోతే ఈ సినిమాను ఈటీవీ విన్ వారు తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ కోసం నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ మొదట థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత కొన్ని వారాల ధియేటర్ రన్ ముగియ గానే ఈ సినిమా ఈటీవీ విన్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించి అనేక ప్రచారాలను చిత్రాలను విడుదల చేయగా అవి అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో , ఏ రేంజ్ విజయాన్ని అందుకొని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: