సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. నయనతార తన కెరియర్లో కొన్ని సినిమాలను వదులుకుంది. తాను వదులుకున్న సినిమాలలో కొన్ని మూవీలు అద్భుతమైన విజయాలను బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాయి. మరి నయనతార వదులుకున్న ఓ రెండు సూపర్ హిట్ మూవీ లు ఏవి అనేది తెలుసుకుందాం.

కొంత కాలం క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "వకీల్ సాబ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా నటించగా ... వేణు శ్రీరామ్మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ పాత్రకు శృతి హాసన్ ను కాకుండా నయనతార ను అనుకున్నారట. అందులో భాగంగా ఆమెను కలిసి స్టోరీ కూడా వివరించారట. కానీ కొన్ని కారణాల వల్ల ఈమె ఆ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట.

చాలా సంవత్సరాల క్రితం తమిళ నటుడు కార్తీ "ఆవారా" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. తమన్నా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... లింగు సామి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ లో మొదట హీరోయిన్ గా తమన్నా ను కాకుండా నాయనతార ను అనుకున్నారట. ఇక నయనతార కూడా ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి మొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈమె ఆ సినిమా నుండి తప్పుకుందట.

ఇలా నయనతార తన కెరియర్లో ఈ రెండు సూపర్ హిట్ మూవీలను వదులుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే నయనతార ప్రస్తుతం అద్భుతమైన క్రేజీ సినిమాలలో నటిస్తూ ఫుల్ జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: