నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరోగా నటించిన మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా అఖండ మూవీ కి కొనసాగింపుగా అఖండ 2 అనే సినిమాని రూపొందిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ నుండి కొన్ని పాటలను , మరికొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఈ సినిమా మొదలు అయినప్పుడు ఈ మూవీ పై అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కానీ ఈ మూవీ నుండి మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ఆ స్థాయిలో లేకపోవడంతో ఈ మూవీ ప్రచార చిత్రాలు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దానితో చాలా మంది ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యి అది అద్భుతమైన రేంజ్ లో ఉన్నట్లయితే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అని భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రచార చిత్రాలు అద్భుతంగా లేకపోవడం కారణం గానో , మరే కారణం గానో తెలియదు కానీ ఈ మూవీ కి నార్త్ అమెరికా లో ఫ్రీ బుకింగ్స్ పెద్దగా జరగడం లేదు అని తెలుస్తుంది.

అసలు విషయం లోకి వెళితే ... నార్త్ అమెరికాలో ఇప్పటికే అఖండ 2 మూవీ కి సంబంధించిన ఫ్రీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ఇక్కడ కేవలం ఈ సినిమాకు ఇప్పటివరకు 60 వేల రేంజ్  డాలర్ మార్కును మాత్రమే ఈ సినిమా అందుకున్నట్లు తెలుస్తుంది. దానితో చాలా మంది ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యి అది అద్భుతమైన రీతిలో ఉన్నట్లయితే నార్త్ అమెరికాలో ఈ సినిమా ఫ్రీ బుకింగ్స్ పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: