ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తాజాగా ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీలో హీరోయిన్గా నటించగా ... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను కొంత కాలం క్రితం నవంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను నవంబర్ 28 వ తేదీన కాకుండా అంతకు ఒక రోజు ముందు అనగా నవంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా నుండి ట్రైలర్ను విడుదల చేశారు.

ఆ ట్రైలర్ కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో తారా స్థాయికి చేరిపోయాయి. దాదాపుగా నవంబర్ నెలలో స్టార్ హీరోల సినిమాలను , భారీ క్రేజ్ ఉన్న సినిమాలను విడుదల చేయరు. చాలా సంవత్సరాల క్రితం టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున "డమరుకం" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా నవంబర్ నెలలో విడుదల అయింది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే 13 సంవత్సరాలు అవుతుంది. 13 సంవత్సరాలు అయినా కూడా ఈ మూవీ వసూలు చేసిన స్థాయి షేర్ కలెక్షన్లను ఈ సినిమా తర్వాత నవంబర్ నెలలో విడుదల అయిన ఏ మూవీ కూడా వదులు చేయలేదు.

ఢమరుకం మూవీ ఆ సమయంలో నవంబర్ నెలలో విడుదల అయ్యి 26 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ప్రస్తుతం ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండడంతో , ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే రామ్ , నాగార్జున హీరో గా రూపొందిన ఢమరుకం మూవీ పేరట ఉన్న కలెక్షన్ల రికార్డు ను క్రాస్ చేసి కొత్త రికార్డును సృష్టిస్తాడు అని చాలా మంది భావిస్తున్నారు. మరి రామ్ "ఆంధ్ర కింగ్ తాలూకా" మూవీ తో  ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: