ఇటీవల రామ్ చరణ్ – జానీ మాస్టర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పెద్ది’ సినిమా ‘చికిరి చికిరి’ సాంగ్ వారి క్రేజ్‌ను తదుపరి స్థాయికి తీసుకెళ్లింది. చరణ్ ఇచ్చిన అవకాశం ఎంత విలువైనదో బాగా తెలుసుకున్న జానీ మాస్టర్, ఆ సాంగ్ కోసం చరణ్ చేత అద్భుతమైన స్టెప్పులు కంపోజ్ చేసి, సెట్‌పై అదిరిపోయే ఎనర్జీని తీసుకొచ్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ విజువల్‌గా ఎలా పేలిందో, రిలీజ్ అయిన వీడియో సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. రీసెంట్‌గా విడుదలైన ‘చికిరి చికిరి’ వీడియో సాంగ్ అభిమానులను రీల్ లెవెల్లో ఊపేస్తోంది. ఈ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు కేవలం దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా వైరల్ అవుతున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల సంఖ్యలో రీల్స్ వస్తుండటం, యూట్యూబ్‌లో భారీ వ్యూస్ చూస్తుంటే… ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అర్థమవుతుంది. కేవలం పది రోజుల్లోనే జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులు ఇంతలా ట్రెండ్ అవ్వడం ఆయన రేంజ్ మళ్లీ పీక్‌కి చేరినట్టే.
ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారమేమిటంటే… జానీ మాస్టర్ పని తీరు పట్ల రామ్ చరణ్ ఇంప్రెస్ అయి, నిర్మాతతో ప్రత్యేకంగా మాట్లాడి ఆయనకు 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇప్పించారట. ఇది నిజమే అయితే, ఇండియన్ కొరియోగ్రాఫర్స్‌లో ఇది సరికొత్త రికార్డ్‌కే సమానం. జానీ మాస్టర్ కెరీర్‌కు ఇది ఒక భారీ బూస్ట్ అవుతుందనడంలో ఏ సందేహం లేదు. మరోవైపు, ఇప్పటికే జానీ మాస్టర్ నాలుగు పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ చేయడానికి సంతకాలు చేశారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా, రెండు పెద్ద హిందీ ప్రాజెక్ట్స్ కూడా వరుసలో ఉన్నాయట. దాంతో ఆయన బిజీ షెడ్యూల్ వచ్చే రెండేళ్లపాటు ఖాళీ లేకుండా ఉండడమే కాకుండా, దేశవ్యాప్తంగా ఆయనకు డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ టాక్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి