సూపర్ స్టార్ మహేష్ బాబు వయసును మించే యవ్వనంగా కనిపించడం కొత్త విషయం కాదు. కానీ ఇటీవల విడుదలైన ‘వారణాసి’ సినిమా ఫస్ట్ లుక్ మాత్రం ఈ చర్చను మళ్లీ దేశవ్యాప్తంగా మరింత పెంచింది. నవంబర్ 15న హైదరాబాద్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా టైటిల్‌ను ప్రకటించగా, ఆయన ‘రుద్ర’ లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు.“50 ఏళ్లు దాటినా… ముఖంలో 30 ఏళ్ల యంగ్ గ్లో!” — ఇది కేవలం అభిమానుల మాట కాదు, మహేష్ బాబు ఫిట్‌నెస్ లైఫ్‌స్టైల్‌ను చూసిన ఎవరికైనా వచ్చే రియాక్షన్ ఇదే.


మహేష్ బాబు ఫిట్‌నెస్ — ఇది సినిమా కోసమే కాదు, అతని జీవన విధానమే. చాలా మంది నటులు సినిమాలో అవసరం వచ్చినప్పుడే ట్రాన్స్‌ఫర్మేషన్ చేస్తారు. కానీ మహేష్ బాబు అలాంటివారు కాదు. ఆయన ఫిట్‌నెస్ అనేది 365 రోజులు, ఏ మాత్రం బ్రేక్ లేకుండా జరిగే క్రమశిక్షణా విధానం. “ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా… బాడీ విషయంలో ఎప్పుడూ జీరో కాంప్రొమైజ్” అని ఆయన ట్రైనర్ స్పష్టం చేస్తాడు.

వర్కౌట్ ప్లాన్ — కట్టుబడిన 5-రోజుల స్ప్లిట్ రొటీన్ :

మహేష్ బాబు వర్కౌట్ సెషన్‌కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.

*వారం లో 5 రోజులు స్ప్లిట్ వర్కౌట్

*ప్రతిరోజూ ఒకే శరీర భాగంపై ఫోకస్

*తేలికైన రోజుల్లో 1 గంట, హై-ఇంటెన్సిటీ రోజుల్లో 1.5 గంటల వరకు వ్యాయామం

*చివర్లో తప్పనిసరిగా డీప్ స్ట్రెచింగ్ సెషన్

*వయసుతో వచ్చే కండరాల కఠినత్వం తగ్గించడం

*మొబిలిటీ మరియు ఫ్లెక్సిబిలిటీ మెరుగు పరచడం

*ఇవి కలిసి ఆయనకు అద్భుతమైన ఫిజిక్ మాత్రమే కాకుండా, ఎప్పుడూ యాక్టివ్ మరియు యంగ్ లుక్ ఇస్తాయి.

ఫుడ్ హాబిట్స్ — ఫ్యాడ్ డైట్స్‌కు పూర్తిగా నో:

అనేక సెలబ్రిటీలు ఫుడ్‌లో భారీ మార్పులు చేస్తూ ఫాడ్ డైట్స్ ఫాలో అవుతుంటారు. కానీ మహేష్ బాబు డైట్ చాలా సింపుల్, క్లీన్, న్యూచురల్. అతను రోజుకు 5–6 చిన్న మీల్స్ తీసుకుంటాడు. అలాగే రోజులో రెండు సార్లు సప్లిమెంట్ షేక్స్ తీసుకోవడం ఆయన రొటీన్‌లో భాగమే. ఇవి ప్రోటీన్, న్యూట్రీషన్‌ను బ్యాలెన్స్ చేస్తూ బాడీ ఎనర్జీని నిలబెడతాయి.

మహేష్ బాబు డైలీ డైట్ ప్లాన్ :

అల్పాహారం:

ఓట్స్,గుడ్లు,నట్స్ (బాదం, వాల్‌నట్స్),పండ్లు

వర్కౌట్ తర్వాత: ప్రోటీన్ షేక్ / న్యూట్రిషన్ షేక్

మధ్యాహ్న భోజనం: చికెన్ / ల్యాంబ్ / ఫిష్..బ్రౌన్ రైస్ / క్వినోవా / ఖుస్ ఖుస్

రాత్రి భోజనం:

హోల్ వీట్ / బ్రౌన్ బ్రెడ్

గుడ్లు లేదా చికెన్

ఈ డైట్ ఆయన బాడీని లీన్, క్లీన్ గా ఉంచడంతో పాటు, యవ్వనంగా కనిపించే స్కిన్ గ్లోకూ కీలకంగా పనిచేస్తుందని ఆయన ట్రైనర్ చెబుతున్నారు.

మహేష్ బాబు లుక్ వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏమిటంటే, అది సంవత్సరాల పాటు కొనసాగిన క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర శిక్షణ. ఇది సినిమా కోసం చేసే తాత్కాలిక ట్రాన్స్‌ఫర్మేషన్ కాదు — ఇది ఆయన లైఫ్‌స్టైల్.

అందుకే…50 ఏళ్లు దాటినా కూడా, మహేష్ బాబు ముఖంలో కనిపించే ‘ఎజ్‌లెస్ ఛార్మ్’ ఇది!

మరింత సమాచారం తెలుసుకోండి: