ఐ బొమ్మ రవి ప్రస్తుతం దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు.. ఎంతోమందికి ఫ్రీగా సినిమాలు అందించి వారి ఆనందానికి కారణమైన ఐ బొమ్మ రవి అరెస్టుతో చాలామంది సామాన్యులు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ముఖ్యంగా న్యాయపరంగా కూడా ఆయనకు సహాయం చేస్తామని ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రవికి సంబంధించి తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయి.అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో పరిచయమైన ఆమె వల్లే ఇదంతా జరిగింది అంటూ పోలీసులు తెలియజేస్తున్నారు. ఇక అసలు విషయం ఏమిటంటే.. కొద్ది సంవత్సరాల క్రితం అమీర్పేట్ కోచింగ్ సెంటర్లో ఐబొమ్మ రవికి ఓ యువతీతో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అలా ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి కూడా చేసుకున్నారు. పెళ్లయ్యాక  వీరు ఏడాది పాటు బాగానే ఉన్నారు. కానీ ఆ తర్వాత ఓ పాప పుట్టాక వీరి మధ్య ఆర్థిక చిచ్చు మొదలైంది. ముఖ్యంగా భార్య అక్క మేం విదేశాల్లో హ్యాపీగా ఉన్నాం..

మీ బతుకులు ఇలా ఉన్నాయి అని హేళన చేయడంతో రవి భార్య తో పాటు ఆయన అత్త కూడా ప్రతిసారి అవమానించి నీతో ఏది కాదు.  నీకు ఏం చేతకాదు.. డబ్బులు సంపాదించడం రాదు అంటూ అవమానించేవారట.అంతేకాదు చివరికి ఐ బొమ్మ రవి భార్య తన బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోవడంతో ఒంటరి వాడు అయిపోయి హ్యాకింగ్ నేర్చుకొని,బెట్టింగ్ యాప్ లు, సినిమాలు పైరసీ చేస్తూ డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అలా రెండు నెలలకో దేశం తిరుగుతూ ఎవరికి దొరకకుండా ఇన్ని రోజులు జాగ్రత్త పడ్డారు. కానీ ఆయన అనుచరులు దొరకడంతో ఇది కాస్త బయటికి వచ్చింది. ఇక రవికి మనుషుల మీద పూర్తిగా నమ్మకం పోయిందట. అందుకే ఆయన ఎవరిని కలిసేవాడు కాదట.కూతురు మీద ఇష్టం ఉన్నా కలిసే అవకాశం లేకపోవడంతో చాలా కృంగిపోయాడట.

ముఖ్యంగా కూకట్పల్లిలోని ఆయన ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలో డోర్ లాక్ కి ఉన్న కెమెరా ముందుగానే గమనించారు.ఎందుకంటే రవి తన ఫ్లాట్లోకి వచ్చేవారిని ముందుగానే ఆ కెమెరా ద్వారా చూసి ఎవరు వచ్చారో నిర్ధారించుకున్నాకే డోర్ తెరిచే వారట. అలా ఆయన ఫోన్ లో డెలివరీ బాయ్స్ నెంబర్లు తప్ప కన్నతండ్రి నెంబర్ కూడా లేదట. అలాగే ఇల్లంతా దుమ్ము ధూళితో చిందరవందరగా పడి ఉందట. దానికి కారణం ఇంట్లో పనిమనిషిని కూడా పెట్టుకునే వాడు కాదట.ఎన్ని దేశాలు తిరిగినా కూడా చివరికి కచ్చితంగా ఇంటికి చేరుకునే వారట. అలా మనుషుల మీద పూర్తిగా నమ్మకం కోల్పోవడంతో పాటు భార్య చేసిన అవమానమే ఆయన్ని ప్రతిసారి వెంటాడేదట.అందుకే రవి ఇలా తయారైపోయాడని పోలీసుల విచారణలో బయటపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: