ఐబొమ్మ రవి పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. అసలు పేరు ఇమంది రవి అయినా ఐబొమ్మ రవిగానే ఇతని పేరు వైరల్ అవుతోంది. ఇతని అరెస్ట్ గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. ఇతనికి న్యాయ సహాయం చేస్తామంటూ పలువురు లాయర్లు స్వచ్చందంగా ముందుకొస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో సైతం షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెళ్లి జీవితంలో ఎదురైనా చేదు అనుభవాల వల్ల ఐబొమ్మ రవి మనుషులపై నమ్మకం కోల్పోయాడు.
నాలుగు సంవత్సరాలుగా అతను కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. రెండు నెలలకో దేశం తిరిగినా తప్పనిసరిగా రవి ఇంటికి చేరేవాడని తెలుస్తోంది. మనుషులపై నమ్మకం సన్నగిల్లడంతో పనివాళ్లను కూడా అతను ఏర్పాటు చేసుకోలేదని సమాచారం అందుతోంది. అతని స్మార్ట్ ఫోన్ లో కూడా కేవలం ఫుడ్ డెలివరీ బాయ్స్ నంబర్లు మాత్రమే ఉన్నాయి.
అమీర్ పేట్ లోని కోచింగ్ సెంటర్ లో పరిచయమైన యువతితో ఐబొమ్మ రవి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఈ దంపతుల మధ్య చిచ్చు పెట్టాయని తెలుస్తోంది. అదే సమయంలో భార్య విదేశాల్లో తమ అక్క కుటుంబాలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని ఎగతాళి చేసేది. భార్య, అత్త కూడా వంత పాడటంతో భార్యాభర్తలు విడిపోయారు. భార్య కూతురిని తీసుకెళ్లడం రవిని మరింత బాధ పెట్టింది.
కూతురిని చూడాలనే కోరిక ఉన్నా ఆ కోరిక తీరే అవకాశం లేకుండా పోయిందని ఐబొమ్మ రవి చెప్పినట్టు సమాచారం అందుతోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి