డార్లింగ్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ప్యాన్-ఇండియా చిత్రం త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనుంది. ముఖ్యంగా, ప్రభాస్ తన కెరీర్‌లోనే మొట్టమొదటిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ లుక్ చూసి అభిమానులు మైమరచిపోతున్నారు. ఆయన లుక్ అదిరిపోయిందని, ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో, కథ, కథనం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రభాస్ ఈ చిత్రంలో అంతర్జాతీయ క్రైమ్ సిండికేట్‌ను కూలదోయడానికి ప్రయత్నించే, క్రమశిక్షణ కలిగిన మరియు తీవ్రమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో యాక్షన్, ఎమోషన్స్ మరియు సంగీతం పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. 2027 సంవత్సరంలో ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

'స్పిరిట్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించి, కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని అభిమానులు, సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ అంతకంతకూ  పెరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ పారితోషికం 100 నుంచి 150 కోట్ల రూపాయల స్థాయిలో  ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: